తిరుమల కొండపై దోపిడీ దొంగలు : పోలీస్ తనిఖీల సమయంలోనే ఓ వ్యాపారి ఇంట్లో దొంగతనం

తిరుమల కొండపై దోపిడీ దొంగలు : పోలీస్ తనిఖీల సమయంలోనే ఓ వ్యాపారి ఇంట్లో దొంగతనం

కలియుగ వైకుంఠం తిరుమలలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు.. పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలోనే ఓ వ్యాపారి ఇంట్లో దొంగతనం చేశారు దుండగులు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఏరియా డామినేషన్ లో భాగంగా 30 మంది సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు పోలీసులు. అదే సమయంలో దోపిడీ దొంగలు పోలీసులకు సవాల్ విసురుతూ దొంగతనం చేశారు. తిరుమలలో స్థానికులు నివాసం ఉండే డీ టైపు క్వాటర్స్ 27వ నంబర్ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు దొంగలు.

మహేంద్ర అనే వ్యాపారి తిరుమలలో వ్యాపారం చేసుకొని రాత్రి ఇంటికి వచ్చే సమయానికి చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు. పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో చోరీ జరిగిందా లేక తనిఖీల తర్వాత జరిగిందా అన్నది తెలియాలి.

►ALSO READ | నోట్ల కట్టల వీడియోతో వైరల్ అయిన వెంకటేష్ నాయుడు ఎవరు..? ఇతనికి ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా.. ?

ఒక పక్క తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలోనే చోరీ జరగడం పోలీసులకు సవాల్ గా మారింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్నారు.