
- 3.5 తులాల బంగారం 65 తులాల వెండి, 61 వేల నగదు అపహరణ
దేవరకొండ(చందంపేట)వెలుగు: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి 3.5 తులాల బంగారం, 65 తులాల వెండి, 61 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఎస్సై లోకేష్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామానికి చెందిన జూలూరు మహేశ్ మంగళవారం ఉదయం 9 గంటలకు వ్యవసాయ పని నిమిత్తం తన బావి దగ్గరకు వెళ్లాడు.
ఇంటికి తాళం వేసి పక్కనే ఉన్న గూట్లో తాళం పెట్టాడు. సోమవారం ఊరెళ్లిన భార్య మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి చూడగా వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. భర్త మహేశ్ కు తెలపడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ బిసన్న, ఎస్సై లోకేశ్ అన్నారు.