
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), సుప్రీం హీరో సాయి ధరమ్(Sai Dharam) కాంబో లో వస్తోన్న మూవీ 'BRO'. ఈ మూవీ నుంచి 'ThemeofBRO' లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. శ్లోకం తో ఉన్న ఈ సాంగ్ ప్రేక్షకులని మరింత ఊపేస్తోంది. అందుకు లిరిసిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి రాసిన లిరిక్స్ చాలా భిన్నంగా ఉండటంతో పాటుగా.. థమన్ అందించిన మ్యూజిక్ మరింత హైప్ ఇస్తోంది.
"కాలం త్రిగుణ సంశ్లేషం..కాలం గమన సంకాశం.. కాలం వజ్రయేత్ చారణం..కాలం జన్మనా జాయతే జయం.. స్వయం శ్రియం ద్వయం" అనే లిరిక్స్ లో కాలమే హీరోగా కనిపిస్తారని తెలియజేశారు. ప్రతి మనిషిలో మూడు రకాల గుణాలు ఉంటాయి.అదే సత్ప గుణం, రజ గుణం, దమ గుణం. సత్ప గుణంలోని వారిని దేవతలుగా..రజ గుణంలో వారిని మానవులుగా..దమ గుణంలోని వారిని రాక్షసులుగా పిలుస్తారని వివరించారు లిరిసిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి.
ఏవైతే ఈ మూడు గుణాల వారున్నరో.. వారేవ్వరూ కాలాన్నికు అతిథులుకారని, వీరందరినీ కూడా కాలం మాత్రమే అనిచిపెట్టగలదని..అంతటి సమర్థత కేవలం ఈ మూవీలో హీరోకి ఉందంటూ..వివరించే ప్రయత్నం చేశానని కళ్యాణ్ పేర్కొన్నారు..కాగా జరిగే గమనంతో..పోటీ పడేది కేవలం కాలం మాత్రమే. అటువంటి కాలంతో హీరో క్యారేక్టర్ ముడి పడిందని..అలాగే హీరో అపజయం లేని వీరుడని చెప్పగా..కట్టుబడిన కాలంతో..పట్టు విడువని సమర్ధవంతుడిగా..మిగిలి ఉన్నటువంటి ధర్మాన్ని కాపాడుటకు ఒక సహోదరుడిగా..కాలం రూపంలో హీరో వస్తాడంటూ".. అంటూ హీరో పవన్ కళ్యాణ్ ని పోల్చుతూ.. రాసిన లిరిక్స్ ఎంతో ప్రేరణను కలిగిస్తున్నాయి.
కళ్యాణ్ చక్రవర్తి తమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో అలా వైకుంఠపురం లోని టైటిల్ సాంగ్, అఖండ మూవీ లోని అమ్మ సాంగ్,ఇలా ప్రతి సాంగ్ లో తను అందించిన లిరిక్స్ అద్భుతంగా ఉండటంతో.. టాలీవుడ్ లో వరుస వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. బ్రో మూవీ ఈ నెల (జులై 28) న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.