టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో కొత్త కుర్రాళ్లకు చోటు కష్టమే!

టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో కొత్త కుర్రాళ్లకు చోటు కష్టమే!

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఎంపికపై డైలమా మొదలైంది. ఐపీఎల్‌‌‌‌లో దుమ్మురేపుతున్న కొత్త స్టార్లకు టీమ్‌‌‌‌లో చోటు దక్కే అవకాశం దాదాపుగా కనబడటం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అనుభవం ఉన్న ప్లేయర్లతోనే జట్టును ఎంపిక చేసే చాన్స్‌‌‌‌ ఉంది. 15 మందితో కూడిన ప్రాథమిక జట్టును ప్రకటించేందుకు మే 1 కటాఫ్‌‌‌‌ తేదీ కావడంతో ఆలోగా సెలెక్షన్‌‌‌‌ ప్రాసెన్‌‌‌‌ను పూర్తి చేయాలని చీఫ్‌‌‌‌ సెలెక్టర్‌‌‌‌ అజిత్‌‌‌‌ అగార్కర్‌‌‌‌ బృందం భావిస్తోంది.

ఈ నేపథ్యంలో ఎటువంటి ప్రయోగాలకు వెళ్లకుండా గతంలో ఇండియాకు ఆడిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఓపెనింగ్‌‌‌‌లో శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌, యశస్వి జైస్వాల్‌‌‌‌లో ఒకరికి మాత్రమే చోటు దక్కే అవకాశం ఉంది. ఐపీఎల్‌‌‌‌లో అద్భుతంగా ఆడుతున్నా తుది లెక్కల ప్రకారం ఇద్దరికీ ప్లేస్‌‌‌‌ కష్టమే. ఇక ఫినిషర్లుగా రింకూ సింగ్‌‌‌‌, శివం దూబే మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రెండో వికెట్‌‌‌‌ కీపర్‌‌‌‌గా సంజూ శాంసన్‌‌‌‌కు జితేశ్‌‌‌‌ శర్మ, కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌, ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ నుంచి పోటీ తప్పకపోవచ్చు. హార్దిక్‌‌‌‌ పాండ్యా బౌలింగ్‌‌‌‌ ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌పై అనుమానాలు ఉన్నా అతనికి ప్లేస్‌‌‌‌ ముప్పులేదనిపిస్తోంది.

కోహ్లీ, రోహిత్‌‌‌‌, సూర్యకుమార్‌‌‌‌, బుమ్రా, జడేజా, రిషబ్​ పంత్‌‌‌‌, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌, సిరాజ్‌‌‌‌, కుల్దీప్‌‌‌‌  ఎంపిక లాంఛనమే అనిపిస్తోంది. రిజర్వ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ స్లాట్‌‌‌‌ కోసం అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌, యజ్వేంద్ర చహల్‌‌‌‌, రవి బిష్ణోయ్‌‌‌‌ మధ్య పోటీ ఉంది. ఇంపాక్ట్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ రూల్‌‌‌‌ ఐపీఎల్‌‌‌‌కు మంచి చేస్తున్నా నేషనల్‌‌‌‌ టీమ్‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌కు మాత్రం ఇబ్బందికరంగా మారింది. ఓవరాల్‌‌‌‌గా ఐపీఎల్‌‌‌‌లో సత్తా చాటుతున్న యంగ్‌స్టర్స్‌ రియాన్‌‌‌‌ పరాగ్‌‌‌‌, అభిషేక్‌‌‌‌ శర్మ, మయాంక్ యాదవ్, హర్షిత్‌‌‌‌ రాణాకు ఇప్పుడు అవకాశం రావడం కష్టమే. మొత్తంగా ఆరుగురు స్పెషలిస్ట్‌‌‌‌ బ్యాటర్లు, నలుగురు ఆల్‌‌‌‌రౌండర్లు, ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు వికెట్‌‌‌‌ కీపర్లు, నలుగురు పేసర్లతో కలిసి 15+5 ప్లేయర్లతో (స్టాండ్‌‌‌‌ బై) టీమ్‌‌‌‌ను ప్రకటించే అవకాశాలున్నాయి.