కళ్లద్దాల వెనుక పెద్ద కథే

కళ్లద్దాల వెనుక పెద్ద కథే

స్టైల్ లేదా కళ్లకు రక్షణ  కోసం చాలామంది నళ్లద్దాలు​ వాడుతుంటారు. కానీ వాటిని కనిపెట్టింది మాత్రం అందుకు కాదు. దాని వెనుక పెద్ద కథే ఉంది. అదేంటంటే..

నళ్లద్దాలు 12 వ శతాబ్దంలో చైనాలో మొదటిసారి కనుగొన్నారు.  అప్పట్లో చైనాలోని జడ్జిలకు వీటి అవసరం వచ్చింది. కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు జడ్జి ఎమోషన్స్‌‌ను ఎదుటివాళ్లు కనిపెట్టకుండా ఉండేందుకు వీటిని వాడేవాళ్లు.  జడ్జి కళ్లలోని ఎమోషన్స్‌‌ను బట్టి క్రిమినల్స్ మాట మార్చడం లేదా తీర్పుని అంచనా వేయడం లాంటివి చేయకుండా నళ్లద్దాలు పనికొచ్చేవి. ఇక ఆ తర్వాత చైనాలోని చాలామంది ధనవంతులు కూడా ఎదుటివాళ్లకి తమ ఎమోషన్స్ అర్థం కాకుండా ఉండేందుకు వీటిని వాడడం మొదలుపెట్టారు. అలా అప్పటినుంచి నళ్లద్దాలు​ ధనవంతులకు సింబల్‌‌గా మారాయి. రోజులు గడిచే కొద్దీ వీటిలో మార్పులొచ్చాయి. వాటిలో వాడే అద్దాలను అప్‌‌డేట్ చేసి సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాలను తట్టుకునేలా డిజైన్ చేశారు. 18వ శతాబ్దంలో జేమ్స్ ఐస్కాఫ్ అనే సైంటిస్ట్ సన్‌‌గ్లాసెస్‌‌పై రకరకాల ప్రయోగాలు చేసి టింటెడ్ సన్‌‌గ్లాసెస్‌‌ కనిపెట్టాడు. అద్దాల్లో నీలం, ఆకుపచ్చ రంగులు వాడితే  కంటి చూపు మారుతుందని, యువీ కిరణాల ప్రభావంలో కూడా మార్పులుంటాయని కనుగొన్నాడు. ఇక 20వ శతాబ్దం నుంచి సన్‌‌గ్లాసెస్ స్టైల్‌‌కు సింబల్‌‌గా మారాయి. సినిమా యాక్టర్స్​ నుంచి సాధారణ వ్యక్తుల వరకూ సన్​గ్లాసెస్​ అంటే ఒకరకమైన మోజు ఏర్పడింది.