ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మారిన పరిస్థితులు

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మారిన పరిస్థితులు

హైదరాబాద్, వెలుగు: సిటీలో అద్దె ఇండ్లతో పాటు అపార్ట్​మెంట్లలో ఫ్లాట్ల కొనుగోలుకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ప్రధానంగా ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో అద్దెకు ఇండ్లు దొరకడం లేదు. సెకండ్ హ్యాండ్​లో ఫ్లాట్లు కొందామని చాలా మంది చూస్తున్నప్పటికీ ఫ్లాట్లు దొరకని పరిస్థితి. డైలీ వందల మంది తమను అప్రోచ్ అవుతున్నట్లు కన్ల్టెన్సీ సంస్థలు, బిల్డర్లు చెబుతున్నారు. కరోనా థర్డ్​వేవ్ తర్వాత సాఫ్ట్​వేర్ కంపెనీలు అన్నీ ఓపెన్ కావడం, ఐటీ ఎంప్లాయీస్ సిటీకి  రావడంతో అద్దె ఇండ్లతో పాటు ఫ్లాట్ల కొనుగోలుకు భారీగా డిమాండ్ ఏర్పడింది.

ప్రస్తుతం నానక్ రాంగూడ, మణికొండ, షేక్ పేట, మాదాపూర్, జేఎన్టీయూ, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో అద్దెకు డబుల్ బెడ్రూం ఫ్లాట్లు, ఇండ్లు దొరకడం కష్టంగా మారింది. వీకెండ్ లో ఫ్యామిలీలతో కలిసి ఉద్యోగులు ఇండ్ల కోసం తిరుగుతున్నారు. ఇండ్లు దొరక్క, కొన్ని నచ్చినట్లుగా లేక కొందరు ఐటీ ఎంప్లాయీస్ ఫ్యామిలీలను ఇంకా సిటీకి తీసుకురాలేదు.

రెట్టింపైన అమ్మకాలు

సిటీలో ఈ ఏడాది ఇండ్లు, ఫ్లాట్ల అమ్మకాలు భారీగా పెరిగిపోయాయి. కొత్తవాటితో పాటు పాత ఇండ్ల సేల్స్ కూడా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే రేట్​డబుల్​అయ్యిందని ఓ కన్సల్టెన్సీ సంస్థ పేర్కొంది. అమ్మకాలు దాదాపు రెట్టింపయ్యాయి. గతేడాది ఇండ్లు, ఫ్లాట్లు కలిపి 25 వేల వరకు అమ్ముడు కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 47 వేలు అమ్ముడుపోయినట్లు పేర్కొంది. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లోనూ అమ్మకాలు ఇలాగే ఉన్నాయి. కొందరు బిల్డర్లు పాత ఫ్లాట్లను కొనుగోలు చేసి రీ సేల్ చేస్తున్నారు.

రూ.35 లక్షల నుంచి ఫ్లాట్లు..

ప్రస్తుతం సిటీలో కొత్త ఫ్లాట్లు అయితే ఏరియాని బట్టి రూ.70 లక్షల నుంచి మొదలవుతున్నాయి. అయితే, సెకండ్ హ్యాండ్​లో రూ.35లక్షల నుంచి రూ.50 లక్షల వరకు దొరుకుతుండటంతో వీటిని కొనేందుకే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.  కూకట్​పల్లి, కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, మణికొండ, కొండాపూర్ లోని రెంటల్ ఫ్లాట్లతో పాటు పాత ఫ్లాట్లకు భారీ డిమాండ్​ ఉంది. అద్దెలకు కూడా డిమాండ్ బాగా పెరిగింది. ఐటీ కారిడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దాదాపు 25 శాతం రెంట్లు పెరిగాయి. టూ బీహెచ్‌‌‌‌‌‌‌‌కేకి 
రూ.25 వేలు, త్రీ బీహెచ్‌‌‌‌‌‌‌‌కేకి రూ.35 వేలపైనే అద్దె ఉంది. మియాపూర్,  కూకట్ పల్లిలో, జగద్గిరిగుట్ట, జేఎన్టీయూ, నార్సింగి, బండ్లగూడ జాగీర్​లో వన్‌‌‌‌‌‌‌‌ బీహెచ్‌‌‌‌‌‌‌‌కే కు రూ. 10వేల లోపు, టూ బీహెచ్‌‌‌‌‌‌‌‌కే కి రూ.15 వేల లోపు రెంట్లు ఉన్నాయి. బేగంపేట, ఎస్ఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో రూ.15 వేలకు పైగానే రెంట్లు ఉన్నాయి.

శివారు ప్రాంతాల వైపు..

ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో ఫ్లాట్లు, ఇండ్లు కొనేందుకు, అద్దెకు దొరక్కపోవడంతో ఐటీ ఎంప్లాయీస్ శివారు ప్రాంతాల వైపు దృష్టి పెడుతున్నారు. అక్కడ కూడా ఇండివిజ్యువల్ ఇండ్లు, సెకండ్ హ్యాండ్​లో ఫ్లాట్లు బాగానే దొరుకుతున్నప్పటికీ ఇప్పుడు దాదాపు అమ్ముడైనట్లు కన్సల్టెన్సీ సంస్థలు చెప్తున్నాయి. దీంతో కొత్తగా నిర్మిస్తున్న అపార్ట్​మెంట్లలో ఫ్లాట్లకు అడ్వాన్స్ ఇచ్చేస్తున్నారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది.

ఫ్లాట్లు దొరకడంలేదు

కరోనా టైమ్​లో వర్క్ ఫ్రమ్ హోం ఉండటంతో ఫ్యామిలీతో కలిసి ఊరికి వెళ్లా. గత నెల నుంచి మళ్లీ ఆఫీసుకు వస్తున్నా. హైటెక్​సిటీ పరిసర ప్రాంతాల్లో సెకండ్ హ్యాండ్​లో డబుల్ బెడ్రూం ఫ్లాట్ కొందామని చూస్తున్నా. కానీ దొరకడం లేదు. అద్దెకు ఉందామన్నా టులెట్ బోర్డులు కనిపించడం లేదు. - రాజేందర్ రెడ్డి, ఐటీ ఎంప్లాయ్, మాదాపూర్

చాలా మంది అడుగుతున్నరు

కొత్తవాటితో పాటు రీ సేల్ ఫ్లాట్లకు బాగా డిమాండ్ ఉంది. ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాలతో పాటు ఓఆర్ఆర్ సమీపంలో ఉండే శివారు ప్రాంతాల్లో ఇండ్లు, ఫ్లాట్లు కావాలని అడుగుతున్నారు. రేట్లు ఎక్కువ ఉండటంతో పాతవి కొనేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నరు. రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు ఉండే ఫ్లాట్లు కావాలని ఎక్కువ మంది అడుగుతున్నారు.   - సంపత్, బిల్డర్