బీఆర్ ఎస్ లో ప్రజాస్వామ్యం లేదు: మైనంపల్లి హనుమంతరావు

బీఆర్ ఎస్ లో ప్రజాస్వామ్యం లేదు: మైనంపల్లి హనుమంతరావు

హైదరాబాద్: మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన కామెంట్ చేశారు.. నా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు. నా కర్యకర్తలు అయోమయంలో ఉన్నారు. అందుకే నేను పార్టీకి రాజీనామా చేశాను అని మైనంపల్లి స్పష్టం చేశారు. కేసులకు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.

కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన మైనంపల్లి.. బీఆర్ ఎస్ లో ప్రజాస్వామ్యం లేదని..అందుకే ప్రశ్నించిన నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో న్యాయం జరగడం లేదని.. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని  కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారని మైనంపల్లి అన్నారు. పార్టీలో అందరికీ ఒకటే న్యాయం ఉండాలని కోరుకున్నామని అది జరగలేదని మైనంపల్లి చెప్పారు. 

రేపటినుంచి తెలంగాణ మొత్తం తిరుగుతాను.. మెదక్ నియోజక వర్గ అభివృద్దికి అందరం కలిసి పనిచేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు మైనంపల్లి హనుమంతరావు.