మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు

మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో కుటుంబ పోరు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ దేశం కోసం పనిచేయాలన్నారు. రాజీవ్‌గాంధీ తర్వాత ఆ కుటుంబం నుంచి ఎవ్వరూ ప్రధాని, సీఎం కాలేదన్నారు ఖర్గే. బీజేపీయే కుటుంబ వివక్షకు మద్దతిస్తుందని ఆ తర్వాత మాపై ఆరోపణలు చేస్తోందన్నారు. నిజానికి బీజేపీలోనే కుటుంబతత్వం ఉందన్నారు. కానీ వాళ్లను దాచి ఉంచడానికి మాపై బురద చల్లుతున్నారతీ ఖర్గే ఆరోపించారు. 

కుటుంబ పార్టీయని కాంగ్రెస్‌పై విమర్శలు ఈరోజు కొత్త కాదన్నారు. విపక్షాలు వీలైనన్ని ఎక్కువసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించి కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టాలని చూస్తుంటాయన్నారు. తాజాగా ఎన్నికలు జరగుతుండడంతో బీజేపీ సహా అనేక పార్టీలు కాంగ్రెస్‌ను కుటుంబతత్వ పార్టీయని విమర్శలు గుప్పిస్తున్నాయన్నారు ఖర్గే. అయితే అదంతా గతమని, ఇప్పుడు కాంగ్రెస్‌లో వారసత్వ రాజకీయాలు ఏమీ నడవడం లేదన్నారు రాజ్యసభ కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే అన్నారు. బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై గురువారం ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇవి కూడా చదవండి:

మంత్రి హరీష్రావుకు రఘునందన్ సవాల్