బడ్జెట్‌లో యువతకు నిరుద్యోగ భృతిపై ప్రస్తావనే లేదు : బహుజన్ సమాజ్ పార్టీ నేత

 బడ్జెట్‌లో యువతకు నిరుద్యోగ భృతిపై ప్రస్తావనే లేదు : బహుజన్ సమాజ్ పార్టీ నేత

ఈ సారి బడ్జెట్ లో అన్ని రంగాల వారికి అన్యాయమే జరిగిందని, నిరాశే మిగిలిందని బహుజన్ సమాజ్  పార్టీ నాయకుడు వెంకటేష్ చౌహన్ ఆరోపించారు. ఎంతో ఆశగా ఎదురు చూసిన నిరుద్యోగ యువతకు కూడా ఈ బడ్జెట్ నిరాశనే మిగిల్చిందన్నారు. అంకెల గారిడితో రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని విమర్శించారు. విద్య రంగానికి తగినన్ని నిధులు కేటాయించలేదని, యువతకు నిరుద్యోగ భృతిపై ప్రస్తావనే లేదని మండిపడ్డారు. 

రాష్ట్రంలో 52 శాతం ఉన్న బీసీలకు బడ్జెట్ లో రూ.6 వేల కోట్లు మాత్రమే కేటాయించారని వెంకటేష్ చౌహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పట్ల ప్రేమను నటిస్తోన్న ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత మందికి దళిత బంధు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో రుణమాఫీ ప్రస్తావన లేదని, రైతులకు రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలను ఈ ప్రభుత్వం విస్మరించిందన్న ఆయన... బడా బాబులకు లబ్ధి చేసే విధంగా బడ్జెట్ ను రూపొందించారని విమర్శించారు.