నిర్మల్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టే యోచన

నిర్మల్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టే యోచన

నిర్మల్ మున్సిపల్ పాలకవర్గంలో చీలిక ఏర్పడింది. దీంతో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పై అవిశ్వాసం తప్పదని సొంత పార్టీ నేతలే హెచ్చరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. అవినీతికి పాల్పడుతున్న చైర్మన్ ఈశ్వర్ గద్దె దిగాల్సిందేనని బీఆర్ఎస్ కౌన్సిలర్ రాజేందర్ హెచ్చరిస్తున్నారు. మున్సిపల్ లో 44 పోస్టులను చైర్మన్ ఈశ్వర్ అమ్ముకున్నారని, ఇదే విషయంపై నిర్మల్ చౌరస్తాలో తాను బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. మున్సిపాలిటీ స్క్రాప్ ను కూడా చైర్మన్ ఈశ్వర్ అమ్ముకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. చైర్మన్ అవినీతి వల్లే మంత్రికి చెడ్డపేరు వస్తోందన్నారు. కౌన్సిలర్లు కూడా చైర్మన్ పక్షాన లేరన్నారు. ఇవాళ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో చర్చించిన తర్వాత  నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.