నిర్ణీత షెడ్యూల్ లోపే రాఫెల్ జెట్స్ డెలివరీ

నిర్ణీత షెడ్యూల్ లోపే రాఫెల్ జెట్స్ డెలివరీ

స్పష్టం చేసిన ఫ్రెంచ్ అంబాసిడర్
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఫ్రెంచ్ తో ఇండియా ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఫ్రెంచ్ ప్రభుత్వంతో ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ కింద 2016, సెప్టెంబర్ లో రూ.58 వేల కోట్లు విలువ చేసే 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఒప్పంద పత్రాలపై ఇండియా సంతకం చేసింది. గత అక్టోబర్ లో డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ఎయిర్ బేస్ లో మొదటి రాఫెల్ జెట్ ను రిసీవ్ చేసుకున్నారు. అయితే మిగిలిన జెట్స్ ఎప్పుడొస్తాయనే దానిపై స్పష్టత కొరవడింది. ఫ్రాన్స్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1.45 లక్షలు దాటగా.. మహమ్మారి వల్ల చనిపోయిన వారి సంఖ్య 28,330గా ఉంది. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా రాఫెల్ జెట్స్ ను నిర్ణీత గడువులోగా ఫ్రాన్స్ డెలివరీ చేయలేదని ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై ఫ్రెంచ్ అంబాసిడర్ ఎమాన్యుయెల్ లెనైన్ స్పష్టతనిచ్చారు.

ఇండియాతో డీల్ ఫైనలైజ్ చేసుకున్న ప్రకారం 36 రాఫెల్ జెట్స్ ను నిర్ణీత గడువులోపే డెలివరీ చేస్తామని లెనైన్ చెప్పారు. ‘రాఫెల్ జెట్స్ కాంట్రాక్టువల్ డెలివరీ షెడ్యూల్ ను మేం గౌరవిస్తున్నాం. కాంట్రాక్టులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు కొత్త ఎయిర్ క్రాఫ్ట్ ను అప్పగించాం.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు ఫెర్రీ ఫ్లయిట్స్ ను సమకూర్చడంలో మేం సాయం చేస్తున్నాం. మొదటి నాలుగు రాఫెల్స్ ను త్వరలోనే ఫ్రాన్స్ నుంచి ఇండియాకు పంపనున్నాం. ఈ నేపథ్యంలో రాఫెల్ జెట్స్ డెలివరీలో షెడ్యూల్ ను పాటించడలేదనడం ఊహాతీతమే అవుతుంది’ అని లెనైన్ పేర్కొన్నారు. ఇకపోతే, ఇండియా ఆర్డర్ చేసిన 36 రాఫెల్ జెట్లలో 30 ఫైటర్ జెట్స్ కాగా.. మరో 6 ట్రెయినర్స్ కోసం ఉపయోగించేవి.