ఆక్సిజన్ డివైజ్‌‌‌‌‌‌‌‌ల కొరత ఉండదిక

ఆక్సిజన్ డివైజ్‌‌‌‌‌‌‌‌ల కొరత ఉండదిక

చైనా నుంచి భారీగా కాన్సంట్రేటర్లు, ఆక్సిమీటర్లు 
హోంకేర్‌‌‌‌‌‌‌‌ డివైజ్‌‌‌‌‌‌‌‌లకు పెరుగుతున్న డిమాండ్‌‌‌‌‌‌‌‌

ముంబై: ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు​, పల్స్​ ఆక్సిమీటర్స్​ వంటి కొవిడ్​ హోమ్​కేర్​ డివైజెస్​​ సప్లయ్​ రాబోయే కొద్ది వారాలలో పెరగనుంది. చైనా, హాంకాంగ్​ల నుంచి ఛార్టర్డ్​, కార్గో ఫ్లైట్లు​ ఆపరేషన్స్​ మొదలవడంతో వాటి లభ్యత ఎక్కువవుతుందని అంచనా వేస్తున్నారు. దేశంలో కొవిడ్​ ఇన్ఫెక్షన్స్​ భారీగా పెరగడంతో ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు, పల్స్​ ఆక్సిమీటర్స్​ దొరక్క ప్రజలు ఇబ్బందిపడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు హాస్పిటళ్లలో బెడ్స్​ కూడా దొరక్కపోవడంతో ఈ హోమ్​కేర్​ డివైజెస్​​ ఇంపార్టెన్స్​ మరింతగా పెరిగింది. ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు​, పల్స్​ ఆక్సిమీటర్స్​ వంటి హోమ్​కేర్​ డివైజెస్​​ ప్రొడక్షన్​ను ఇప్పటికే చైనా మాన్యుఫాక్చరర్లు పెంచారని దేశంలోని మెడికల్​ డివైజెస్​​ తయారీదారులు, ఇంపోర్టర్లు చెబుతున్నారు.
మొదలవుతున్న ఫ్లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీసులు...
వారం రోజుల కిందట ఇండియాకు ఫ్లైట్లు​ ఆపేసిన సిచువాన్​ ఎయిర్​లైన్స్​ (చైనా ఎయిర్​లైన్స్​) ఈ ఆదివారం నుంచి మళ్లీ సర్వీసులు మొదలెడుతోంది. చాలా మంది కార్గో ఆపరేటర్లూ ఇండియాకు ఫ్లైట్లు​ను సస్పెండ్​ చేశారు. చైనా నుంచి సరుకు తీసుకొచ్చేందుకు మన విమానాలను బుక్​ చేసుకోవడానికి అనుమతించాలని మరోవైపు ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియన్​ ఛాంబర్స్​ ఆఫ్​ కామర్స్​ అండ్​ ఇండస్ట్రీ (ఫిక్కీ) ప్రభుత్వాన్ని కోరుతోంది.  చైనా నుంచి లైఫ్​ సేవింగ్​ డివైజెస్​ను తక్కువ ఖర్చుతో ఇక్కడకు తెచ్చుకోవడానికి ఈ చర్య సాయపడుతుందని బీపీఎల్​ మెడికల్​ టెక్నాలజీస్​ సీఈఓ సునీల్​ ఖురానా చెప్పారు. ఛార్టర్డ్​ ఫ్లయిట్లు మొదలయినప్పటికీ, కొన్ని కార్గో ఫ్లయిట్లను కారియెర్లు చివరి నిమిషంలో క్యాన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌​ చేస్తున్నారని ఆయన అన్నారు. కస్టమర్లకు తాము డెలివరీ ఇస్తామని హామీ ఇవ్వడంతో ఇది తమకు సమస్యగా మారుతోందని చెప్పారు. ఏమైనా, రాబోయే వారాలలో చైనా నుంచి సప్లయ్​లు మరింత మెరుగుపడతాయని పరిశ్రమ వర్గాలు ఆశాభావంతోనే ఉన్నాయి. కార్పొరేట్లు, ఎన్​జీఓలు, వ్యక్తులు కూడా ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు​ కొనుగోలుకు ఇబ్బడిముబ్బడిగా ఆర్డర్లు పెట్టడంతో సప్లయ్​ చెయిన్​, లాజిస్టిక్స్​, ఎయిర్​లైన్స్​ మీద ఒత్తిడి పెరిగింది. ప్రతీ రెండో రోజూ ఒక  ఆక్సిజన్​ డివైజ్​ల  కన్​సైన్​మెంట్​ ఇండియాకి వచ్చేలా ఇంపోర్టర్లు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. దేశంలో అలాంటి డివైజ్​​ల గిరాకీ అమాంతం సప్లయ్​ని మించిపోయింది. అయితే, ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు​కు కన్సూమర్లు గతంలో కంటే రూ. 3 నుంచి 10 వేలు ఎక్కువ చెల్లించాల్సి రావచ్చునని అంటున్నారు. ఎందుకంటే చైనా సప్లయర్లు వాటి రేట్లను పెంచేసినట్లు ఇంపోర్టర్స్​ చెబుతున్నారు. దానికితోడు రవాణా వ్యయం కూడా పెరిగిందని అంటున్నారు. చైనా కంపెనీల నుంచి ఆక్సిమీటర్స్​ కొనడానికి గతంతో పోలిస్తే మూడు నుంచి ఆరు డాలర్లు ఎక్కువ వెచ్చించాల్సి వస్తోందని, దీంతో రేట్లు పెరగడం తప్పనిసరని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఫ్లయిట్లు మొదలవడంతో ఇప్పుడు ప్రతి రెండో రోజూ ఒక కన్‌‌‌‌‌‌‌‌సైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌​ వస్తోందని గిజ్​మోర్​ సీఈఓ సంజయ్​ కలిరోనా చెప్పారు. ఇళ్లలో వాడే ఆక్సిజన్​ కాన్సంట్రేటర్ల​ సప్లయ్​ కొంత మెరుగుపడినప్పటికీ, ఎక్కువ ఆక్సిజన్​ డెలివరీ చేసే యూనిట్లు రావడానికి మాత్రం ఇంకో 20 రోజులు పట్టొచ్చని ఆయన వెల్లడించారు.