
సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) హీరోగా తెరకెక్కుతున్న 'జైలర్' మూవీలోని మొదటి సింగిల్‌ను గురువారం సన్ పిక్చర్స్ విడుదల చేసింది.దళపతి విజయ్ బీస్ట్‌లోని ‘అరబిక్ కుతు’లో సాంగుకు మ్యూజిక్ ఇచ్చిన అనిరుధ్(Anirudh), కొరియోగ్రఫర్ జానీ మాస్టర్(Jani Master) డైరెక్టర్ నెల్సన్(Nelsan) ఇప్పుడు వీరి కలయికలో వచ్చిన మరో సాంగ్ ‘కావలా’ తమిళం మరియు తెలుగులో చాలా ఆసక్తికరంగా రూపొందించారు.
తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ ట్రేండింగ్ నెం.1 లో నిలిచినట్లు ఈసన్ పిక్చర్స్ సంస్థ ట్విట్టర్ వేదికగా పంచుకుంది. ఆడియన్స్ ప్రతి ఒక్కరి నోట్లో కావాలా సాంగ్ మారు మ్రోగుతున్నట్లు మేకర్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సాంగ్ మారో అరబిక్ కుతు లా ఉందంటూ ఫ్యాన్స్ నెట్టింట్లో కామెంట్స్ పెడుతున్నారు. 'దూరం కావాలా నన్నే విడిచీ..వేరై పోవాలా అన్నీ మరీచి' లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి.
అరుణ్‌రాజా కామరాజ్(Arunrajakamaraj) రాసిన సాహిత్యంతో, ఈ పాటకు శిల్పారావ్(shilparao) చక్కగా పాడారు. కాస్ట్యూమ్స్ డిజైన్ పల్లవి సింగ్(Pallavi Singh) వర్క్ వావ్ అనిపించేలా ఉంది. ఈ పాటలో తమన్నా గిరిజన అమ్మాయిల కూడిన రంగురంగుల డ్రెస్సెస్ లో రజనీకాంత్‌తో వేసే స్టెప్పులు ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇక ముందు ముందు ఈ సాంగ్ ఎలాంటి రికార్డ్స్ క్రీయేట్ చేస్తుందో చూడాలి.