హైదరాబాద్లో సీడబ్ల్యూసీ మీటింగ్​ హైలైట్స్ ఇవే..

హైదరాబాద్లో సీడబ్ల్యూసీ మీటింగ్​ హైలైట్స్ ఇవే..
  •     తొలిసారి హైదరాబాద్​లో సీడబ్ల్యూసీ మీటింగ్ జరగడంతో హైదరాబాద్ మొత్తం సోనియా, రాహుల్ ఫ్లెక్సీలతో నిండిపోయింది. ముఖ్యంగా ఎయిర్ పోర్ట్ నుంచి మెహిదీపట్నం, బంజారాహిల్స్​లోని తాజ్ కృష్ణ వరకు  భారీ ఫ్లెక్సీలను నేతలు ఏర్పాటు చేశారు.
  •     ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో గుస్సాడీ కళాకారులు డ్యాన్స్ ప్రదర్శన చేస్తూ తాజ్ కృష్ణకు చేరుకున్నారు.
  •     శంషాబాద్ ఎయిర్‌‌‌‌పోర్టుకు చేరుకున్న కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ,  ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, చత్తీస్‌‌గఢ్, రాజస్థాన్, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు, సీడబ్ల్యూసీ నేతలకు  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. ఆదివాసీ నృత్యాలు, డప్పులు, కొమ్ము వాయిద్యాలతో ఆహ్వానం పలికారు.
  •     ఎయిర్ పోర్టు నుంచి నేరుగా తాజ్ కృష్ణ హోటల్‌‌కు చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే.. అక్కడ  సీడబ్ల్యూసీ సభ్యులు ఇచ్చిన విందులో పాల్గొన్నారు. తెలంగాణ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు.
  •     కాంగ్రెస్ అధికారంలో ఉన్న నాలుగు రాష్ట్రాల సీఎంలు, సీడబ్ల్యూసీలోని 39 మంది సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు, 13 మంది ప్రత్యేక ఆహ్వానితులు తొలి రోజు సమావేశాలకు హాజరయ్యారు. శనివారం కేవలం సీడబ్ల్యూసీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌‌ మాత్రమే జరిగింది. మీటింగ్ వివరాలను ఎంపీలు చిదంబరం, జైరామ్ రమేశ్, పవన్ ఖేరా తదితరులు మీడియాకు వెల్లడించారు. 
  •     మీటింగ్‌‌కు ముందు సేవాదళ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోనియా, రాహుల్, ప్రియాంక, ఠాక్రే, రేవంత్, భట్టి విక్రమార్క హాజరై కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు.
  •     ఆదివారం 29 రాష్ట్రాల పీసీసీ చీఫ్​లు, సీఎల్పీ నేతలు, పార్లమెంట్ అబ్జర్వర్లు, ఆఫీస్ బేరర్లతో రెండో రోజు సమావేశం నిర్వహించనున్నారు. అందుకోసం 159 మందిని పార్టీ ఆహ్వానించగా.. 149 మంది హాజరుకానున్నారు.
  •     రాష్ర్టవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన 60 మంది సేవాదళ్ నేతలకు లంచ్ దొరకలేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.