ఫిబ్రవరిలో థియేటర్స్కి రానున్న సినిమాలు ఇవే!

ఫిబ్రవరిలో థియేటర్స్కి రానున్న సినిమాలు ఇవే!

జనవరి నెలలో సంక్రాంతి సినిమాలు ఆడియన్స్ ను అలరించాయి. ఆ సీజన్ లో టాలీవుడ్ నుండి ఏకంగా 4 టాప్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో హనుమాన్, గుంటూరు కారం సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వరద పారించాయి. ఈ రెండు సినిమా కూడా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయి. దాదాపు రెండు వారాలు గడుస్తున్నా హనుమాన్ సినిమా జోరు మాత్రం తగ్గడం లేదు. ఇటీవలే రూ.250 కోట్ల కలెక్షన్స్ సాధించిన నేపధ్యంలో గ్రాటిట్యూడ్ మీట్ నిర్వహించారు మేకర్స్.

ఇక సంక్రాంతి సినిమాల సందడి కాస్త తగ్గడంతో ఫిబ్రవరి సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. ఫిబ్రవరిలో తెలుగు, తమిళ, హిందీ, హాలీవుడ్ తో కలుపుకొని ఏకంగా 15 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో ముందుగా.. ఫిబ్రవరి 2న సుహాస్ హీరోగా వస్తున్న అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజు గేమ్, బూట్ కట్ బాలరాజు, హ్యాపీ ఎండింగ్ వంటి సినిమాలు కూడా విడుదల కానున్నాయి. ఇక రెండోవారం ఫిబ్రవరి 8వ తేదీ లిస్టులో మాత్రం క్రేజీ సినిమాలే ఉన్నాయి. వాటిలో రవితేజ ఈగల్, యాత్ర2 వస్తున్నాయి. ఆ తరువాత ఫిబ్రవరి 9న సూపర్ స్టార్ రజిని కాంత్ నుండి వస్తున్న లాల్ సలాం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇక ఫిబ్రవరి 16న వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్, సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన, సుందరం మాస్టార్ వంటి సినిమాలు రిలీజ్ కానున్నాయి. చివరి వారంలో.. సంతోష్ శోభన్ జోరుగా హుషారుగా షికారు పోదామా, రాజ్ తరుణ్ తిరగబడారా స్వామి సినిమాలు థియేటర్స్ కి వస్తున్నాయి. మరి ఈ సినిమాలలో ఏ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోనుంది అనేది చూడాలి.