
ఇంట్ల కాలు బయటపెట్టకుండనే ఓ టూర్ వేసొస్తె? అట్లెట్ల అయితది? చాలా సింపుల్, దేశంలోని అందమైన టూరిస్ట్ ప్లేస్‌లను అంతకంటే అందంగా చూపించిన సినిమాలు ఎన్నో ఉన్నయ్. ఆ సినిమాల్ని టూరిస్ట్ ప్లేస్‌ల కోసమే చూస్తే.. టూర్ వెళ్లొచ్చిన ఫీలింగ్ కలుగతది. ఆ సినిమాలు మనమూ చూసేద్దాం చలో..
బాంబే టు గోవా
1972లో వచ్చిన ‘బాంబే టు గోవా’ అప్పట్లో ది బెస్ట్ క్లాసిక్‌గా నిలిచింది. మహారాష్ట్ర, గోవా అందాలను అప్పుడున్న టెక్నాలజీతోనే ఎంతో అందంగా చూపించిన సినిమా ఇది. అమితాబ్, శత్రుఘ్న సిన్హా, అరుణా ఇరానీ, మెహమూద్ మెయిన్ రోల్స్ పోషించిన ఈ సినిమా కామెడీ, రోడ్ అడ్వెంచర్ సీన్లకు కేరాఫ్‌గా నిలిచింది.
ఎ ప్యాసేజ్ టు ఇండియా
ఈఎం ఫోర్స్టర్ రాసిన ఓ బుక్ ఆధారంగా ఇంగ్లీష్ డైరెక్టర్ డేవిడ్ లీన్ 1984లో తీసిన సినిమా ఇది. ఈ సినిమాలో బీహార్ స్టేట్‌లోని టూరిస్ట్ ప్లేస్‌లను అందంగా చూపించారు. బారాబర్ కేవ్స్, బంకీపూర్, పాట్నా సిటీలతోపాటు మరెన్నో చారిత్రక కట్టడాలను ఈ సినిమా చాలామందికి పరిచయం చేసింది.
యే జవానీ హై దీవానీ
బాలీవుడ్ ట్రావెల్ మూవీస్‌లో ది బెస్ట్ పిక్చర్ ఇది. రణ్‌బీర్‌కపూర్, దీపికా పదుకొనెల ప్రయాణం స్టోరీగా సాగే ఈ సినిమాలో కులు మనాలీ, రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్, కాశ్మీర్, గుల్మార్గ్, పెహల్గామ్, శ్రీనగర్ టూరిస్ట్ ప్లేస్‌లను చూస్తుంటే కళ్లు తిప్పుకోలేరు.
జబ్ వి మెట్
ఇదో ట్రైన్ జర్నీ స్టోరీ. కరీనాకపూర్, షాహిద్ కపూర్ జంటగా తెరకెక్కిన ఈ సినిమాలో కూడా హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి, నగ్గర్ టూరిస్ట్ ప్లేస్‌ల ప్రకృతి అందాలు చూడొచ్చు. చివర్లో చూపించే భటిండాలోని పచ్చని పొలాలు ప్రేక్షకుల కళ్లకు హాయినిస్తాయి.
ది డార్జిలింగ్ లిమిటెడ్
ఇటీవలే మరణించిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ఖాన్తోపాటు హాలీవుడ్ నటులు ఓవెన్ విల్సన్, అడ్రియన్ బ్రాడీ, జాసన్ లీడ్ రోల్స్ పోషించారు. భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించే ఈ ముగ్గురి సోదరుల ప్రయాణం థీమ్‌గా సాగే ఈ సినిమాలో ఉదయ్‌పూర్ నుంచి హిమాలయాల వరకు ఎన్నో టూరిస్ట్ ప్లేస్‌లు చూపించారు.
శుద్ధ్ దేశీ రొమాన్స్
రాజస్తాన్‌లోని జైపూర్ అందాలను చూపించిన బాలీవుడ్ సినిమాలు ఎన్నో ఉన్నా అవన్నీ ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’ సినిమా తర్వాతే అని చెప్పుకోవాలి. ఓవైపు పింక్‌సిటీ అందాలను చూపిస్తూనే బ్లూ సిటీగా పేరున్న జోధ్‌పూర్‌లోని మెహ్రన్‌గఢ్ కోటను కూడా చూపించారు. ఈ సినిమాలో ఈ రెండు టూరిస్ట్ ప్లేస్‌లు కూడా లీడ్ రోల్స్ పోషించాయనే చెప్పాలి.
హైవే
ఇది జస్ట్ మూవీ మాత్రమే కాదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ను నింపే జర్నీ కూడా. హిమాచల్‌ప్రదేశ్‌లోని అందాలను చూపిస్తూనే… మారుమూల ప్రాంతాలైన సాంగ్లా, ఆరు, చందన్వారీ, పెహల్గామ్ల్లోని లోయలు, కొండలు చూపించారు. వీటితో పాటు కశ్మీర్ మంచు పర్వతాలు, గుజరాత్‌లోని ఉప్పు నేలల్లోకి మనల్ని తీసుకెళ్తుంది.
చెన్నై ఎక్స్‌ప్రెస్
గోవాలోని దూధ్‌సాగర్ జలపాతాలు, కేరళ అందాలు, మున్నార్‌లోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌తోపాటు ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామేశ్వరాన్ని కూడా చూడొచ్చు ఈ సినిమాలో.