లాభాల్లో ఈ బ్యాంకులు అదుర్స్

V6 Velugu Posted on Oct 27, 2021

బ్యాంకుల సెప్టెంబర్ క్వార్టర్‌‌ రిజల్ట్స్‌ అంచనాలకు మించి నమోదవుతున్నాయి. నాలుగు బ్యాంకులు మంగళవారం రిజల్ట్స్ ప్రకటించగా, మూడు బ్యాంకుల నికర లాభం భారీగా పెరిగింది. ఒక బ్యాంకు ఫర్వాలేదనిపించింది.                                                           - బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు


యాక్సిస్ బ్యాంక్‌..
యాక్సిస్ బ్యాంక్  రిజల్ట్స్‌‌ అదుర్స్ అనిపించాయి. బ్యాంక్ నికర లాభం సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌ (క్యూ2) లో 86 % పెరిగింది. కిందటేడాది సెప్టెంబర్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌లో బ్యాంక్‌‌కు రూ.1,683 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ2 లో  రూ. 3,313 కోట్లు వచ్చింది. నికర వడ్డీ ఆదాయం  ఏడాది ప్రాతిపదికన 8% పెరిగి రూ. 7,900 కోట్లకు ఎగిసింది. కిందటేడాది క్యూ2లో బ్యాంక్‌‌ ఆదాయం రూ.7,326 కోట్లుగా ఉంది.  బ్యాంక్ ప్రొవిజన్లు సెప్టెంబర్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌లో   రూ. 1,735  కోట్లకు తగ్గాయి. జీఎన్‌‌పీఏ రేషియో 3.53 శాతంగా ఉంది. 

కెనరా బ్యాంక్‌‌..
సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో   కెనరా బ్యాంక్‌‌కు రూ. 1,332 కోట్ల  నికర లాభం (స్టాండ్‌‌ ఎలోన్‌‌) వచ్చింది. కిందటేడాది ఇదే క్వార్టర్‌‌‌‌లో వచ్చిన రూ. 444.41 కోట్లతో పోలిస్తే ఇది రెండు రెట్లు ఎక్కువ. బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 20,793.92 కోట్ల నుంచి రూ. 21,331.49 కోట్లకు ఎగిసింది. బ్యాంక్ గ్రాస్ ఎన్‌‌పీఏల రేషియో సెప్టెంబర్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌లో 8.42 శాతంగా ఉంది. కిందటేడాది ఇదే క్వార్టర్‌‌‌‌లో గ్రాస్‌‌ ఎన్‌‌పీఏల  రేషియో 8.23 శాతంగా రికార్డయ్యింది.  వాల్యూ పరంగా చూస్తే బ్యాంక్ గ్రాస్ ఎన్‌‌పీఏలు ఏడాది ప్రాతిపదికన రూ. 53,437.92 కోట్ల నుంచి రూ. 57,853.09 కోట్లకు పెరిగాయి. నెట్‌‌ ఎన్‌‌పీఏలు మాత్రం రూ. 21,063.28 కోట్ల నుంచి రూ. 20,861.99 కోట్లకు తగ్గాయి. ప్రొవిజన్లు రూ.3,974 కోట్ల నుంచి రూ. 3,360 కోట్లకు తగ్గాయి. 

సెంట్రల్ బ్యాంక్..
సెంట్రల్ బ్యాంక్ నికర లాభం క్యూ2 లో రూ. 250 కోట్లకు పెరిగింది. కిందటేడాది సెప్టెంబర్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌లో బ్యాంక్‌‌కు రూ. 161 కోట్ల లాభం వచ్చింది. ఇది 55.28 % పెరుగుదల. సీక్వెన్షియల్‌‌గా చూస్తే, సెంట్రల్ బ్యాంక్‌కు జూన్ క్వార్టర్‌‌లో రూ. 206 కోట్ల లాభం వచ్చింది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ. 2,354 కోట్ల నుంచి రూ. 2,495 కోట్లకు పెరిగింది.  బ్యాంక్ గ్రాస్ ఎన్‌‌పీఏల రేషియో  ఏడాది ప్రాతిపదికన 17.36 శాతం నుంచి 15.52 శాతానికి తగ్గాయి. నెట్ ఎన్‌‌పీఏల రేషియో 5.60 శాతం నుంచి 4.51 శాతానికి తగ్గాయి. బ్యాంక్ మొత్తం డిపాజిట్లు క్యూ2 నాటికి రూ. 3,36,500 కోట్లకు ఎగిసింది. 


కోటక్ బ్యాంక్..
కోటక్ బ్యాంక్ నికర లాభం సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో 7 శాతం తగ్గి రూ. 2,032 కోట్లుగా రికార్డయ్యింది. కిందటేడాది ఇదే క్వార్టర్‌‌‌‌లో రూ. 2,184 కోట్ల లాభాన్ని  బ్యాంక్‌‌ ప్రకటించింది. నికర వడ్డీ ఆదాయం రూ. 3,897 కోట్ల నుంచి రూ. 4,021 కోట్లకు పెరగగా,    బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 8,252.71 కోట్ల నుంచి రూ. 8,408.87 కోట్లకు చేరుకుంది.  గ్రాస్‌‌ ఎన్‌‌పీఏ రేషియో 2.55 శాతం నుంచి 3.19 శాతానికి, నెట్‌‌ ఎన్‌‌పీఏ రేషియో 0.64 శాతం నుంచి 1.06 శాతానికి పెరిగాయి. సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో రూ. 423.99 కోట్లను ప్రొవిజన్ల కోసం కోటక్ బ్యాంక్ పక్కన పెట్టింది.

Tagged business, Banks, Profits,

Latest Videos

Subscribe Now

More News