Good Health : ఈ బేసన్ దోషని టిఫిన్.. స్నాక్స్గా తీసుకోవచ్చు.. డిన్నర్గా కూడా తినొచ్చు..!

Good Health : ఈ బేసన్ దోషని టిఫిన్.. స్నాక్స్గా తీసుకోవచ్చు.. డిన్నర్గా కూడా తినొచ్చు..!

ఇడ్లీ, దోశె, ఉప్మా.. బ్రేక్‌ పాస్ట్ లో మాత్రమే తింటారు చాలామంది. అయితే, వీటినే కొంచెం వెరైటీగా చేసుకుంటే సాయంత్రం స్నాక్ గా, డిన్నర్ ఐటమ్ కూడా తినొచ్చు. పైగా పిల్లలు కూడా ఇలాంటి కొత్త వంటకాలను ఇష్టంగా తింటారు.

బేసన్ దోషకు కావలసిన పదార్థాలు:

బియ్యం: 4 కప్పులు (5 గంటలు నానబెట్టాలి) మినప్పప్పు : ఒక కప్పు (5 గంటలు నానబెట్టాలి) శెనగపప్పు : ఒక కప్పు, అటుకులు: కొంచెం మెంతులు: ఒక టేబుల్ స్పూన్ పంచదార: ఒక టేబుల్ స్పూన్, ఉప్పు: రుచికి సరిపడా, బేకింగ్ సోడా: చిటికెడు. 

మసాలా కోసం..
బంగాళదుంపలు: రెండు(మెత్తగా ఉడికించాలి) ఉల్లిపాయలు: రెండు (సన్నగా తరిగి నెయ్యిలో ఫ్రై చేయాలి), ఉప్పు: రుచికి సరిపడా 

చట్నీ కోసం..
కొబ్బరి తురుము: ఒక కప్పు, పచ్చిమిర్చి: నాలుగు పంచదార: ఒక కప్పు, అల్లం : చిన్న ముక్క, కొత్తిమీర తరుగు: కొంచెం, పోపు దినుసులు: మూడు టేబుల్ స్పూన్లు ఇంగువ : చిటికెడు, నూనె: ఒక టేబుల్ స్పూన్ ఉప్పు: రుచికి తగినంత

Also Read:ఈ మసాలా ఇడ్లీని టిఫిన్.. స్నాక్స్గా తీసుకోవచ్చు.. డిన్నర్గా కూడా తినొచ్చు..!

తయారీ
దోశ కోసం సిద్ధం చేసుకొన్న పదార్ధాలన్నీ మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పిండిని రాత్రంతా పక్కన పెట్టాలి. తర్వాత రోజు స్టవ్ మీద పాన్ పెట్టి పిండిని పల్చటి దోశెలా వేయాలి. రెండు వైపులా దోరగా కాలే వరకు కొద్దిగా నెయ్యి వేయాలి. మసాలా కోసం రెడీ చేసుకొన్న పదార్థాలన్నీ దోశె మీద ఒక పొరలా పరచాలి. లేదంటే మధ్యలో పెట్టి దోశను మడతపెట్టుకుంటే సరిపోతుంది. చట్నీ కోసం రెడీ చేసుకున్న పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ చట్నీతో బేసన్ దోష బాగుంటుంది.