ఈ స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయ్

ఈ స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయ్

ప్రపంచ వ్యాప్తంగా ఐటీ కంపెనీలు ఉద్యోగులను తీసివేస్తున్న క్రమంలో.. కొత్తగా ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి అనే వాళ్లకు.. స్టార్టప్ కంపెనీలు ఆహ్వానాలు పలుకుతున్నాయి. మీ దగ్గర టాలెంట్ ఉంటే చాలు.. మేం ఉద్యోగం ఇస్తాం అని ప్రకటిస్తున్నాయి. నాలుగు స్టార్టప్ కంపెనీలు.. తమ దగ్గర ఉన్న బోలెడు వేకెన్సీలు ఉన్నాయని.. టాలెంట్ కోసం వెయిట్ చేస్తున్నామని ప్రకటించాయి. అలాంటి నాలుగు స్టార్టప్ కంపెనీల వివరాలు మీ కోసం..

ఫిజిక్స్ వాలా : 


ఆన్ లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ ఫాం స్టార్టప్ కంపెనీ. ప్రస్తుతం ఈ కంపనీలో 6 వేల 500 మంది పని చేస్తున్నారు. రాబోయే మూడు నెలల్లోనే.. కొత్తగా 2 వేల 500 మందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు ప్రకటించింది కంపెనీ. ఇందు కోసం ఫిజిక్స్ టీచర్లు, విద్యా నిపుణులు అవసరం అవుతారని స్పష్టం చేసింది. అదే విధంగా బిజినెస్ అనలిస్టులు, డేటా అనలిస్టులు, కౌన్సెలర్లు, ఆపరేషన్ మేనేజర్ల అవసరం కూడా ఉందని.. మంచి జీతాలు ఇస్తామని ప్రకటించింది ఫిజిక్స్ వాలా స్టార్టప్ కంపెనీ. 

లైఫ్ రే : 


క్లౌడ్ టెక్నాలజీ, ప్రాడెక్ట్ డెవలప్ మెంట్, ఆపరేషన్స్, మార్కెటింగ్ విభాగాల్లో సాఫ్ట్ వేర్ టెక్నాలజీ అందించే లైఫ్ రే.. త్వరలోనే బెంగళూరులో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా 200 మంది ఐటీ నిపుణులు అవసరం అని.. వీళ్లను స్థానికంగా రిక్రూట్ చేసుకుంటామని స్పష్టం చేసింది. దశల వారీగా మరింత మందిని తీసుకోవటం జరుగుతుందని.. రాబోయే 24 నెలల్లో మరిన్ని ఉద్యోగ నియామకాలు చేపడతామని వెల్లడించింది కంపెనీ. ఇప్పటికే 19 దేశాల్లో సేవలు అందిస్తున్నామని.. ఇండియా భారీ విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం చేసింది లైఫ్ రే కంపెనీ.

టీఎస్ఏడబ్ల్యూ డ్రోన్స్ :

డ్రోన్ టెక్నాలజీ స్టార్టప్ కంపెనీ అయిన టీఎస్ఏడబ్ల్యూ.. తమ కంపెనీలో ప్రస్తుతం 50 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని.. 2023 డిసెంబర్ నాటికి 350 మంది ఇంజినీరింగ్ నిపుణులను రిక్రూట్ చేయబోతున్నట్లు ప్రకటించింది కంపెనీ. ఇండియా మొత్తం కంపెనీ విస్తరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కొత్త తరహా డ్రోన్ల తయారీ, డ్రోన్ టెక్నాలజీ సర్వీసులు అందిస్తున్న ఈ స్టార్టప్ కంపెనీలో యువ ఇంజినీర్లతోపాటు సీనియర్ ఐటీ నిపుణుల అవసరం ఉందని తెలిపింది. ప్రస్తుతం వివిధ కంపెనీల్లో ఉద్యోగం కోల్పోయిన వారిలో.. టాలెంట్ ఉన్నోళ్లకు అవకాశం కల్పిస్తామని కంపెనీ స్పష్టం చేస్తుంది.

సీఎల్ఎక్స్ఎన్ఎస్ కంపెనీ :

సీఎల్ఎక్స్ఎన్ఎస్ స్టార్టప్ కంపెనీలో 700 మంది ఉద్యోగులను నియమించుకోవటానికి రెడీ అవుతుంది. ప్రాడెక్ట్ డెవలప్ మెంట్, ఇంజినీరింగ్ అండ్ డిజైన్, మార్కెటింగ్, డేటా అనాలసిస్ విభాగాల్లో ఈ రిక్రూట్ మెంట్ ఉందని స్పష్టం చేసింది కంపెనీ. ఆన్ లైన్ సర్వీస్ సొల్యూషన్స్ విభాగంతోపాటు.. మిడ్ లెవల్ లో ఈ నియామకాలు ఉంటాయని వివరించింది కంపెనీ. ఈ ఏడాదిలోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని.. కంపెనీ ప్రాజెక్టుల ఆధారంగా ఉద్యోగుల సంఖ్యను పెంచుకునే ఆలోచన చేస్తున్నామని కూడా తెలిపింది కంపెనీ.

ఐటీ కంపెనీలు ఉద్యోగులను తీసివేయటమేనా.. రిక్రూట్ మెంట్ లేదా అనే వాళ్లకు.. ఇలాంటి స్టార్టప్ కంపెనీలు ఊరట ఇస్తున్నాయి. పెద్ద కంపెనీల్లో ఉద్యోగం కోల్పోయిన వారితోపాటు.. కొత్తగా మార్కెట్ లోకి వస్తున్న ఐటీ ప్రొఫెషనల్స్ కూడా స్టార్టప్స్ కంపెనీలు రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. కాకపోతే ఒకే ఒక్క మాట కామన్ గా వస్తుంది ఈ కంపెనీల నుంచి.. టాలెంట్ గట్టిగా ఉండాలి.. స్కిల్స్ అద్భుతంగా ఉండాలనేది మాత్రం డిమాండ్ చేస్తున్నాయి. మరీ అంత టాలెంట్.. అద్భుతమైన స్కిల్స్ ఉంటే ఉన్న కంపెనీలు ఎందుకు తీసేస్తాయంటున్నారు నిరుద్యోగులు.. ఎవరి వెర్షన్ ఎలా ఉన్నా.. స్టార్టప్ ఐటీ కంపెనీల్లో మాత్రం బోలెడు ఉద్యోగులు అయితే ఉన్నాయనేది సత్యం.