లగ్జరీలోనూ మనోళ్లు సూపర్

లగ్జరీలోనూ మనోళ్లు సూపర్

లగ్జరీ కొనుగోళ్లలో హైదరాబాద్ వాసులు ముం దంజలో ఉన్నా రు. నగరంలో లగ్జరీ వస్తు వుల కొనుగోళ్లు గణనీయంగా పెరుగుతున్నాయని అమెరికన్ ఎక్స్‌ ప్రెస్ ఓ సర్వేలో వెల్లడించింది .హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో 2013 లో లగ్జరీ వస్తు వుల పై 16 శాతంగా ఉన్న ఖర్చు , 2018 నాటికి 52 శాతానికి పెరిగింది . నగరవాసు లు గతేడాది ఎలక్ట్రా నిక్స్‌ పై52 శాతం ఖర్చుచే యగా, 38శాతం లగ్జరీ రిటేల్ వస్తు వులపై, ఆ తరువాత జ్యువెల్లరీ పై ఖర్చు చేసినట్లు అమెరికన్ ఎక్స్‌ ప్రెస్ లగ్జరీ స్పెండ్ అనాలిసిస్ 2018 అనే రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో వెల్లడించింది . లగ్జరీ పై 68 శాతం ఖర్చు వీక్‌‌‌‌‌‌‌‌డేస్‌ లోనే చే సినట్లు తెలిపింది. ఢిల్లీ, ముంబై,బెంగుళూరు తో పాటు, కోల్ కతా, చెన్నై, పూణే, హైదరాబాద్ నగరాలు కూడా లగ్జరీ స్పెండింగ్‌ లో పోటీ పడుతున్నాయి.

భారతీయులు ఎక్కువగా హైఎండ్ ఫ్యాషన్, జ్యువెల్లరీ, ఎలక్ట్రా నిక్స్ వంటివాటి పై ఖర్చు చేస్తున్నారు. లగ్జరీ పై ఖర్చు 2017 లో 29 శాతంగా ఉండగా, 2018 కి 34 శాతానికి పెరిగింది .ఇండియా పర్యటించే యుఎస్ ట్రావెలర్స్ ఇక్కడ లగ్జరీ షాపింగ్‌ ఎక్కువగా చేస్తున్నా రు. 2013 వరకు జ్యువెల్లరీ పై ఎక్కువగా ఖర్చు చే యగా, ప్రస్తుతం ఈ ట్రెండ్ మారిందని, ఎలక్ట్రా నిక్స్, హైఎండ్ ఫ్యాషన్ వంటివాటికి తాజాగా ప్రాధాన్యత పెరుగుతోందని అమెరికన్ ఎక్స్‌ ప్రెస్ ఇండియా సీ ఈవో మనోజ్ అడ్లఖ తెలిపారు. బీసీజీ డేటా ప్రకారం పెద్ద నగరాల్లో  కంటే చిన్న నగరాల్లోనే లగ్జరీ ఖర్చు వేగంగా పెరుగుతోంది .చిన్న నగరాల్లో ఈ వృధ్ది 14 శాతంగా ఉండగా, పెద్ద నగరాల్లో ఇది 12 శాతమే.