
మహీంద్రా అండ్ మహీంద్రా, వార్నర్ బ్రదర్స్‌తో కలిసి బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ అనే లిమిటెడ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ఈ కారును "ది డార్క్ నైట్‌ట్రయాలజి" ఆధారంగా రూపొందించారు. ధర రూ.27.79 లక్షలు (ఎక్స్-షోరూమ్). కేవలం 300 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. బుకింగ్స్ ఆగస్టు 23 నుంచి, డెలివరీలు సెప్టెంబర్ 20న ప్రారంభమవుతాయి. 7.2 కిలోవాట్స్ చార్జర్ కోసం రూ.50 వేలు,11.2 కిలోవాట్స్ చార్జర్ కోసం రూ.75 వేలు అదనంగా చెల్లించాలి.