
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ శుక్రవారం ఢిల్లీలో 4జీ సేవలను సాఫ్ట్ లాంచ్ చేసింది. అంటే పార్టనర్ నెట్‌వర్క్‌ను వాడుకొని ఈ సేవలను అందుబాటులో తెచ్చింది. బీఎస్‌ఎన్ఎల్ సీఎండీ ఏ రాబర్ట్ జె. రవి మాట్లాడుతూ, "పార్టనర్ నెట్‌వర్క్‌ల ద్వారా 4జీ యాజ్ ఏ సర్వీస్‌గా 4జీ సేవలను ఢిల్లీలో అందుబాటులోకి తెచ్చాం. నూతన బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు తక్షణమే 4జీ సేవలు పొందగలుగుతారు.
దేశవ్యాప్తంగా స్వదేశీ 4జీ నెట్‌వర్క్‌ను నిర్మించుకుంటాం" అని అన్నారు. వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ లేదా ఎంటీఎన్‌ఎల్ కస్టమర్ సర్వీస్ కేంద్రాల్లో లేదా రిటైలర్ల వద్ద సిమ్, ఈకేవైసీ చేయించుకోవచ్చు. గత సంవత్సరం ఈ టెలికాం కంపెనీ రూ. 25 వేల కోట్ల పెట్టుబడితో 4జీ సేవలు ప్రారంభించింది. ఒక లక్ష మొబైల్ టవర్లు ఏర్పాటు చేసింది. దీంతో పాటు తన నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడానికి రూ. 47 వేల కోట్లను బీఎస్‌ఎన్‌ఎల్ పెట్టుబడిగా పెట్టనుంది.