కెమికల్ నురగతో నిండిపోయిన యమునా నది

కెమికల్ నురగతో నిండిపోయిన యమునా నది

 ఢిల్లీ: యమునా నది కాలుష్యంతో నిండిపోయింది. ఢిల్లీని ఆనుకుని ప్రవహిస్తున్న నదిలో పూర్తిగా కెమికల్స్ కలిసిపోయాయి. దీంతో నది అంతా నురగతో నిండిపోయింది. నదిలో చాలా దూరం వరకు నురగ పేరుకుపోయింది. హిమాలయాల్లో మంచు మాదిరాగానే యమునా నదిలో కెమికల్ నురగ కనిపిస్తోంది. నదిలో రసాయనాలు ఎక్కువగా చేరడం వల్లే తీవ్రంగా నురగ తయారవుతోందని స్థానికులు అంటున్నారు.