దొంగను పట్టిచ్చిన కిచిడీ

దొంగను పట్టిచ్చిన కిచిడీ

గువాహటి : దొంగతనానికి వచ్చిన వారు చడీచప్పుడూ కాకుండా పని కానిస్తారు. కానీ ఓ దొంగ మాత్రం కన్నం వేసిన ఇంట్లో కిచిడీ వండుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. అసోంలోని గువహటిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

అసోం రాజధాని గువాహటిలోని హెంగెరాబారి ప్రాంతంలో ఓ ఇంటి తాళం పగలగొట్టిన దొంగ లోపలికి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నింటినీ మూటగట్టాడు. మధ్యలో ఆకలి వేయడంతో కిచెన్లోకి వెళ్లి కిచిడీ వండుకోవటం మొదలుపెట్టాడు. కానీ వంట చేసే సమయంలో అలికిడి కావడం అతని కొంప ముంచింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో పొరిగింటి వంటింటి నుంచి శబ్దాలు రావడం పక్కింటి వారికి అనుమానం కలిగించింది. వెంటనే అలర్టైన వారు విషయాన్ని పోలీసులకు చెప్పారు. రంగంలోకి దిగిన పోలీసులు తాపీగా కిచిడీ వండుకుంటున్న దొంగను పట్టుకున్నారు. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. "కిచిడీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా దొంగతనం చేసే సమయంలో కిచిడీ వండటం ఆరోగ్యానికి హానికరం. దొంగను అరెస్ట్ చేశాం. గువాహటి పోలీసులు వేడి వేడి భోజనం అందిస్తున్నారు" అంటూ చేసిన ట్వీట్ను గువాహటి పోలీస్ కమిషనర్ రీట్వీట్ చేశారు.

మరిన్ని వార్తల కోసం..

సిద్ధార్థ్ క్షమాపణపై స్పందించిన సైనా

ఢిల్లీలో 1700మంది పోలీస్ సిబ్బందికి క‌రోనా