
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ కుర్రోడు అమ్మా, నాన్నలకు గిఫ్ట్‌లు ఇచ్చేందుకు బ్యాంక్‌ను దోచిండు. ఆ డబ్బుతో తల్లికి 50వేల నగలు, తండ్రికి 40వేలతో ఓ సెకండ్ హ్యాండ్ కార్ కొనిచ్చిండు. అజయ్ బంజారే(18) తన ఫ్రెండ్ ప్రదీప్ ఠాకూర్ ఇద్దరూ కలిసి నాగ్‌పూర్‌లోని కో ఆపరేటివ్ బ్యాంకుకు కన్నంవేసి రూ.4.78 లక్షలకు పైగా విలువైన క్యాష్, నగలను ఎత్తుకెళ్లారు. అజయ్ తన పేరెంట్స్‌కు గిఫ్ట్‌లిచ్చాక ఇద్దరూ కలిసి రాజస్థాన్ వెళ్లిపోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఖరీదైన మొబైల్స్ కొన్నారు. మరో సెకండ్ హ్యాండ్ కారు కొనేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు దొరికిపోయారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి రూ. 2 లక్షలు రికవరీ చేశారు. అజయ్ తన అమ్మా నాన్నలను ఆకట్టుకునేందుకు దొంగగా మారాడని పోలీసులు తెలిపారు.