ఏటీఎంను పగలగొట్టిన దొంగలు

ఏటీఎంను పగలగొట్టిన దొంగలు

గద్వాల, వెలుగు: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి పాత కూరగాయల మార్కెట్ సమీపంలో గల పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంను  పగలగొట్టి చోరీ చేసేందుకు ప్రయత్నించారు. ఉదయం గమనించిన స్థానికులు గురువారం  సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 

విషయం తెలుసుకున్న బ్యాంక్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఏటీఎంను పరిశీలించారు.  బ్యాంక్ మేనేజర్ గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకుని ఎంక్వయిరీ చేస్తున్నట్టు టౌన్ పోలీసులు తెలిపారు.