దొంగల బీభత్సం..షెటర్లు పగలగొట్టి గోల్డ్,డబ్బులు చోరీ

దొంగల బీభత్సం..షెటర్లు పగలగొట్టి గోల్డ్,డబ్బులు చోరీ

హైదరాబాద్ నగర శివారులో వరుస చోరీలకు పాల్పడుతున్నారు దొంగలు. హయత్ నగర్  సూర్యవంశీ కాలనీలో మూడు ఇళ్లలో చోరీ చేశారు. అబ్దుల్లాపూర్ మెట్టు కేంద్రంలో మూడు షాపుల షెటర్లు పగలగొట్టి.. డబ్బులు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... సీసీ కెమెరాలో విజువల్స్ ఆదారంగా దర్యాప్తు చేస్తున్నారు.