హాస్పిటల్ నుంచి 1,710 వ్యాక్సిన్ల దొంగతనం

హాస్పిటల్ నుంచి 1,710 వ్యాక్సిన్ల దొంగతనం

కరోనా కేసులు ఎక్కువ అవుతుండటంతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌కు, వెంటిలేటర్లకు, వ్యాక్సిన్లకు కొరత ఏర్పడింది. దాంతో చాలామంది వ్యాక్సిన్లను అడ్డదారిలో ఎక్కువరేటుకు అమ్ముకుంటున్నారు. గత్యంతరం లేక వినియోగదారులు కూడా వేలల్లో, లక్షల్లో డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. దీన్ని అవకాశంగా మలుచుకున్న కేటుగాళ్లు.. వ్యాక్సిన్ల దొంగతనాలకు పాల్పడుతున్నారు. వారం కిందట జైపూర్‌లోని కన్వాటియా ఆస్పత్రి నుంచి 320 కోవాక్సిన్ డోసులు దొంగిలించబడ్డాయి. అది మరువక ముందే తాజాగా హర్యానాలో కూడా వ్యాక్సిన్ల దొంగతనం జరిగింది. జింద్‌లోని పీపీ సెంటర్ జనరల్ హాస్పిటల్ నుంచి 1710 డోసుల వ్యాక్సిన్లు దొంగతనం చేయబడ్డాయి. దాంతో ప్రస్తుతం జిల్లాలో వ్యాక్సిన్లు ఒక్కటి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. 

వ్యాక్పిన్ల మిస్సింగ్ గురించి పై అధికారులకు రిపోర్టు చేశాం. స్టోర్ రూమ్‌లోని ఇతర మందులు, డబ్బులు ఏవీ తీయలేదు. కానీ వ్యాక్సిన్లు మాత్రమే తీసుకెళ్లారు. ఆ 1710 డోసులలో 1270 కోవిషీల్డ్, 440 కోవాక్సిన్ డోసులున్నాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం’ అని హాస్పిటల్ ఇన్‌చార్జ్ తెలిపారు. 

వ్యాక్సిన్లను భద్రపరచిన హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ స్టోర్ రూమ్ దగ్గర ఎటువంటి సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేయలేదు. కనీసం ఒక గార్డును నియమించకపోవడం పట్ల అనుమానాలు వస్తున్నాయి. కాగా.. కోవిడ్ -19 వ్యాక్సిన్లను వృధా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో హర్యానా రెండవ రాష్ట్రం కావడం గమనార్హం.