
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వల్ల దేశ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు. ఇప్పటికే కేరళలో కరోనా వైరస్ బారిన పడి ఇద్దరు చికిత్స పొందుతున్నారు. తాజాగా ఈ సంఖ్య మూడుకు చేరింది. కేరళలో మరో కేసు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ అధికారికంగా ధృవీకరించారు. కేరళ కాసర్‌గోడ్ జిల్లాలో ఈ కేసు నమోదైంది. ప్రస్తుతం బాధితుడిని ప్రత్యేకంగా ఓ వార్డులో పెట్టి చికిత్స అందిస్తున్నారు.
ఈ మహమ్మారి వ్యాపించకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రులు చెబుతున్నారు. కానీ రోజుల వ్యవధిలోనే ఈ వైరస్ ముగ్గురు వ్యక్తులకు సోకడంతో కేరళ ప్రజలతో పాటు మిగతా రాష్ట్రాల వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Kerala Health Minister KK Shailaja: Third case of #coronavirus tested positive in Kerala in Kasargod. pic.twitter.com/g39OgJ98JO
— ANI (@ANI) February 3, 2020