ఈ పక్షి వేగం గంటకు 350 కి.మీ

ఈ పక్షి వేగం గంటకు 350 కి.మీ

పెరిగ్రిన్​ ఫాల్కన్… డేగల్ల ఓ జాతి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎగిరే పక్షి. దీని వేగం గంటకు 350 కిలోమీటర్లు. అంటే ఫార్ములా వన్​ రేసింగ్ ​కారు స్పీడ్​కు సమానం. ఇప్పుడీ బర్డ్​మరో రికార్డు సొంతం చేసుకుంది. ఎంత వేగంతో వెళ్తుందో అంతే కచ్చితత్వంతో చూడగలదని ఓ స్టడీలో తేలింది. జంతు రాజ్యంలోనే ఫాస్టెస్ట్ ​విజన్​బర్డ్​గా గుర్తింపు పొందింది. ఇది సెకనుకు 130 ఫ్రేమ్స్​ను క్యాప్చర్​చేస్తుందని స్టడీ వెల్లడించింది. అదే మనిషైతే  సెకనుకు 50–60 ఫ్రేమ్స్​​మాత్రమే క్యాప్చర్​ చేయగలడట.  ఒక సినిమా సెకనుకు 25 ఇమేజెస్​ వేగంతో నడిచినప్పుడే మనిషి దాన్ని చూడగలుగుతాడని పేర్కొంది. స్వీడన్​లోని లండ్ యూనివర్సిటీ రీసెర్చర్స్​ చేసిన స్టడీలో ఈ విషయం తేలింది.  సేకర్ ​ఫాల్కన్ ​సెకనుకు102, హారిస్​ హాక్​77 బ్లింక్స్ ​రిజిస్టర్ ​చేస్తుందని స్టడీ తెలిపింది. వేటాడే సమయంలో పక్షులు ఏ విధంగా స్పందిస్తాయని శాస్త్రవేత్తలు తొలిసారి బర్డ్స్​ విజన్ ​స్పీడ్​ను లెక్క గట్టారు. ‘‘నా కొలిగ్​ నేను ఫస్ట్​ టైమ్ ​డేగ జాతి పక్షుల విజన్ ​స్పీడ్​ను లెక్కించాం. ఈ స్పీడ్​ఒక్కో బర్డ్​కు ఒక్కో విధంగా ఉంటుంది. అవి వేటాడే తీరుపై ఇది ఆధారపడుతుంది.

పెరిగ్రిన్ ​ఫాల్కన్ ​వేగంగా ఎగిరే పక్షులను వేటాడుతుంది. ఇలాంటి పక్షులను వేటాడాలంటే వాటి అల్ట్రాస్పీడ్​ మూవ్​మెంట్స్​ను గుర్తించే సామర్థ్యం ఉండాలి. పెరిగ్రిన్ ​ఫాల్కన్​కు ఆ శక్తి ఉంది. అదే హారిస్ ​హాక్​కు హైవిజన్ ​స్పీడ్​తో ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇది భూమిపై ఉండే చిన్న చిన్న జంతువులను వేటాడుతుంది” అని స్టడీ కో–ఆథర్​అల్మాట్​ కెల్బెర్ ​చెప్పారు. ‘‘కచ్చితమైన విజన్​, విభిన్న దృశ్యాలను క్యాప్చర్​చేయగల సామర్థ్యం పెరిగ్రిన్​ఫాల్కన్​సొంతం. ఈ క్వాలిటీస్​తోనే ఇది వేటాడే సమయంలో వేగంగా డైవ్​ చేస్తుంది. దీని వేగం ఫార్ములా వన్​ రేసింగ్ ​కారుకు సమానం” అని పేర్కొన్నారు. ‘‘చెప్పాలంటే ఇది ఒక పోటీలా ఉంటుంది. ఫ్లై బర్డ్స్​వేగంగా ఎగురుతాయి. అదే సమయంలో వాటికి ఫాస్టెస్ట్​ విజన్​ ఉంటుంది. అలాగే వాటిని వేటాడాలనుకునే బర్డ్… అంతకంటే వేగంగా ఎగిరి, వాటిని పట్టుకోగలగాలి. ఇలాంటి లక్షణాలు పెరిగ్రిన్ ​ఫాల్కన్​కు ఉన్నాయి” అని మరో సైంటిస్ట్ ​సిమన్​ పొటియర్ ​తెలిపారు.  పక్షులు మరింత స్వేచ్ఛగా ఎగిరే పరిస్థితులను కల్పించేందుకు ఈ స్టడీ ఉపయోగపడుతుందన్నారు.