శెభాష్ రైతన్న :రంగు రంగుల్లో క్యాబేజీ పంట..ఏడాదికి రూ.15 లక్షల సంపాదన

శెభాష్ రైతన్న :రంగు రంగుల్లో క్యాబేజీ పంట..ఏడాదికి రూ.15 లక్షల సంపాదన

ఆధునిక పద్దతుల్లో వ్యవసాయం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు ఈ రైతు. సంప్రదాయ పంటలకు భిన్నంగా డిమాండ్ కు తగ్గ పంటలను.. ఆధునిక వ్యవసాయ పద్దతుల్లో పంటలు పండిస్తున్నాడు. రంగు రంగుల్లో క్యాబేజీని పండించి బాగా సంపాదిస్తున్నాడు.తనకున్న కొద్దిపాటి భూమిలో తక్కువ నీటి సౌకర్యంతో రంగు క్యాబేజీ సాగు చేస్తున్నాడు. రంగురంగుల ఈ క్యాబేజీలను ప్రజలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారట.. సంప్రదాయ పంటలతో పోలిస్తే రంగు క్యాబేజీ పంటతో ఎన్నో రెట్లు ఎక్కువ వస్తోందంటున్నాడు ఈ రైతు. 

బీహార్ లోని ముజఫర్ పూర్ కు చెందిన రైతు రాజ్ కుమార్ చౌదరి .. తనకు మూడెకరాల భూమిలో తెలుపు, నీలం, ఆకుపచ్చ, ఊదా, పసుపు, నారింజ రంగు క్యాబేజీని పండించారు.దీంతో ఏడాదికి రూ. 15 లక్షలకు పైగా సంపాదిస్తున్నారు. సంప్రదాయ పంటలతో పోలిస్తే రంగు క్యాబేజీ సాగులో ఎన్నో రెట్లు ఎక్కువ లాభం ఉందంటున్నారు రాజ్ కుమార్ చౌదరి. రంగు రంగుల క్యాబేజీని ప్రజలు కూడా ఎక్కువ గా ఇష్టపడుతున్నారని చెప్పారు. 

తన వద్ద ఇంగ్లండ్,తైవాన్, జపాన్ కు చెందిన మూడు రకాల క్యాబేజీలే ఉన్నాయని..  వీటి కలర్ ఎరుపు, పసుపు పచ్చ అని .. మార్కెట్లో వీటి ధర కిలో రూ. 80 నుంచి రూ. 100 వరకు లభిస్తుందని చౌదరి అన్నారు. రకరకాల కలర్లతో మార్కెట్ అందాన్ని ఈ వెరైటీ క్యాబేజీ మరింతగా పెంచుతుందంటున్నారు చౌదరి. ప్రజలు కూడా ఈ క్యాబేజీ రంగులో ఏదో ప్రత్యేకత ఉంది అని ఆశ్చర్యపోతున్నారట. వీటితో కూర వంటి గా రుచుగా ఉంటుందని, అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయ పడుతున్నాయని అంటున్నారు. ఈ పంటను సాధారణంగా నవంబర్ లో నాటి.. ఫిబ్రవరి చివరి వారంలో మార్కెట్లోకి వస్తుందని అంటున్నారు. 

తెల్ల క్యాబేజీతో పోలిస్తే రంగు క్యాబేజీని పండించడం ద్వారా సంపాదన మెరుగవుతుందంటున్నారు రాజ్ కుమార్ చౌదరి. తెల్ల క్యాబేజీ సాగుకు రూ. 300 ఖర్చు చేస్తే.. రంగుల క్యాబేజీ సాగుకు రూ. 1300 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే వీటి ధర కూడా అంతే స్థాయిలో మార్కెట్లో ఉంటుందన్నారు. ప్రస్తుతం ఐదు రంగుల క్యాబేజీని పండిస్తున్నాం. అందులో మూడు రంగులు మార్కెట్ కు వెళ్లేందుకుసిద్దంగా ఉన్నాయన్నారు.రంగు క్యాబేజీ మార్కెట్లో రూ. 100 నుంచి రూ. 120 పలుకుతోంది.