Good Food : చర్మం ముడతలకు కారణం ఇదే.. ఈ ఫుడ్ తీసుకుంటే యంగ్గా కనిపిస్తారు

Good Food : చర్మం ముడతలకు కారణం ఇదే.. ఈ ఫుడ్ తీసుకుంటే యంగ్గా కనిపిస్తారు

కొందరు నడివయసులోనే ముసలి వాళ్లలా కనిపిస్తారు. చర్మం ముడతలు పడటం వల్ల అలా కనిపిస్తారు. దానికి కారణం కోలన్ తక్కువ ఉండడమే. అనే పేరు విని అదేదో అనుకోకండి. అది కూడా ప్రొటీనే. బాడీలో కోలజెన్ ఉంటేనే చర్మం. తాజాగా, హెల్దీగా ఉంటుంది. జెన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలంటారా... దీనికోసం టాబ్లెట్స్, పౌడర్స్ ఉంటాయి. కానీ, నేచురల్ పద్ధతిలో తీసుకుంటే మరీ మంచిది. నేచురల్ గా ఒంట్లో కోలన్ కోవాలంటే సరైన ఫుడ్ తీసుకోవాలి. అవేంటంటే..

బోన్ సూప్ : 

మటన్, చికెన్ వంటి వాటితో తయారుచేసిన బోన్ సూప్ తాగాలి. అందులో బోన్స్, కనెక్టివ్ టిష్యూలు ఉంటాయి. వాటివల్ల క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, కోలజెన్, గ్లూకోజమైన్, కాండ్రియోటిన్, అమైనోయాసిడ్స్ వంటి చాలా రకాల న్యూట్రియెంట్లు అందుతాయి. అయితే, వాడే ఇంగ్రెడియెంట్స్న బట్టి బోన్ సూప్ లో కూడా రకాలున్నాయి.

చికెన్: 

చికెన్ లో కనెక్టివ్ టిష్యూ ఎక్కువ ఉంటుంది. అంటే అది తింటే కోలజెన్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది. కోడి తల భాగం, బోనీకి అతుక్కుని ఉండే మాంసంలో కోలజెన్ ఎక్కువ ఉంటుంది. అంతేకాదు, ఇది ఆర్థరైటిస్ ట్రీట్ మెంటు ఉపయోగపడుతుందని చాలా స్టడీస్ లో తేలింది.

చేపలు: 

చేపల్లోనూ బోన్స్, టిష్యూ ఎక్కువ ఉండే భాగాలు (లిగమెంట్స్) ఉంటాయి. వాటినుంచి కోలజెన్ తయారవుతుంది. తల, పొలుసులు, కనుగుడ్లలో ఉంటుంది. వీటన్నింటిని తీసేసి తినడం వల్ల చేపల నుంచి కోలజెన్ ఎక్కువ మొత్తంలో అందదు. కోడిగుడ్డు తెల్లసొన : కోడిగుడ్డులో కనెక్టివ్ టిష్యూ ఉండదు. కానీ, ప్రొలైన్ అనే అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. అవి కోలజెనన్ను ప్రొడ్యూస్ చేస్తాయి. 

పండ్లు: 

ప్రొ - కోలజెన్ ను ప్రొడ్యూస్ చేయడానికి విటమిన్ – సి అవసరం. దానికోసం ద్రాక్ష, ఆరెంజ్లు తినాలి. ద్రాక్షపండ్లను ఉడికించి, ఆరెంజ్లతో కలిపి సలాడ్ చేసుకుని కూడా తినొచ్చు. వీటితోపాటు సి-విటమిన్ కోసం బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీస్, కివీ, పైనాపిల్, జామ పండ్లు తినొచ్చు. జామపండులో జింక్ కూడా ఉంటుంది. అది కోలజెన్ ప్రొడక్షన్కు కో-ఫ్యాక్టర్గా ఉపయోగపడుతుంది. 

వెల్లుల్లి: 

వెల్లుల్లి కూడా కోలజెన న్ను ప్రొడ్యూస్ చేస్తుంది. రెగ్యులర్గా ఫుడ్ తీసుకోవడం మంచిది. కాకపోతే ఎక్కువ మొత్తంలో తీసుకుంటే గుండె మంట, బ్లీడింగ్ ఎక్కువ అవడం, కడుపునొప్పి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కోలజెన్ కోసమని అతిగా తీసుకోకుండా, రోజూవారీ వంటల్లో తింటే చాలు. 

ఆకుకూరలు:

ఆకుకూరల్లో క్లోరోఫిల్ ఉంటుంది. దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. నిజానికి కోలజెన్ పెరగడానికి ఆకు కూరలు తింటే చాలు. అందులో ఉండే క్లోరోఫిల్ కూడా కోలజెన్కు సమానమే అని కొన్ని స్టడీల్లో తేలింది. 

బీన్స్, నట్స్ : 

బీన్స్ లో ప్రొటీన్స్ ఎక్కువ. కొన్నింటిలో కాపర్ కూడా ఉంటుంది. ఈరెండు కోలజెన్ ప్రొడక్షన్కు అవసరమైనవే. వీటితోపాటు జీడిపప్పులు కూడా తినాలి. వీటిలో ఉండే జింక్, కాపర్ రెండూ కోలజెన్ ను తయారుచేస్తాయి. 

టొమాటో: 

ఇది కూడా విటమిన్-సి ఫుడ్. ఒక చిన్న టొమాటోలో 30 శాతం కోలజెన్ ను అవసరమైన నూట్రియెంట్స్ అందుతాయి. అంతేకాదు, వీటిలో లైకోపిన్ ఉంటుంది. అది యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేస్తుంది. 

క్యాప్సికం: 

సలాడ్స్, శాండ్విచ్లో వీటిని వాడుతుంటారు. వీటిలో ఉండే విటమిన్ -సి యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్ పనిచేస్తుంది. యవ్వనంగా కనిపించాలనే ఆశతో ఎక్కువగా ఏవీ తినొద్దు. ఎందుకంటే తినే వాటిలో కోలజెన క్కు పనికొచ్చే వాటితోపాటు వేరేవి కూడా ఉంటాయి. కాబట్టి చక్కె రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండే పదార్థాలు తినొద్దు. తింటే ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దానివల్ల కోలజెన్ డామేజ్ అయ్యే ప్రమాదముంది.