ఇదో రకం వాలీబాల్ గేమ్..ఇందులో కుక్క కూడా ప్లేయరే..

ఇదో రకం వాలీబాల్ గేమ్..ఇందులో కుక్క కూడా ప్లేయరే..

సాధారణంగా వాలీబాల్ గేమ్లో అటో ఆరుగురు.. ఇటో ఆరుగురు ఉంటే కేవలం చేతులతో మాత్రమే బాల్ ను లిఫ్ట్ చేస్తూ ఆడతారు మనందరికి తెలుసు.. ఈ గేమ్ లో లిఫ్టర్, షూటర్, డిఫెండర్ ఇలా కీలక ఆటగాళ్లు ఉంటారు.. అయితే కేవలం మనుషులం మాత్రమే ఆడే గేమ్ కదా.. కానీ ఈ కంటెంట్ తో జత చేసిన వీడియో లో మీరు కుక్కు వాలీబాల్ ఆడుతుండటం చూస్తారు. మీరు వింటున్నది నిజమే.. సేమ్ టు సేమ్ ప్లేయర్లు ఆడినట్టుగానే కుక్క బాల్ ని లిఫ్టర్ గా బాల్ ను అందిస్తుంది. అంతేకాదు ఈ గేమ్ లో మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే.. ప్లేయర్లు చేతులతో కాకుండా కాళ్లు, ఛాతి, తలతో ఈ గేమ్ ను అడుతారు. ఈ వింతైన గేమ్ కు సంబంధించిన వీడియోను చూద్దాం రండి. 

ఈ వీడియోలో వాలీబాల్ కోర్టులో అటు ఇద్దరు.. ఇటు ఇద్దరు ప్లేయర్లు మాత్రమే ఆడుతున్నారు. ఈ ఆటలో కుక్క లిఫ్టర్ అన్నమాట. కుక్క చక్కగా..బాల్ అబ్జర్వ్ చేస్తూ.. కోర్టు నలు మూలలా తిరుగుతూ..షూటర్ కు బాల్ను అందిస్తుంది. బాల్ ని కోర్టులో ఒక్కసారి కూడా  మిస్ చేయకుండా లిఫ్ట్ చేస్తుంది. అంతేకాదు.. మధ్య మధ్యలో అవతలి కోర్టులో ప్లేస్ వేయడం ద్వారా పాయింట్లు కూడా తెస్తోంది. ఆ కుక్క ఏంత మంచి ప్లేయరో ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది.. దీనికి బెస్ట్ లిఫ్టర్ అవార్డు ఇవ్వొచ్చు. కుక్క టాలెంట్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అలాగే చేతులతో కాకుండా కాళ్లు, ఛాతి, తలతో వాలీబాల్ అడుతున్న ఈ ప్లేయర్లను మెచ్చుకోవాల్సిందే..