పెట్టుబడులకు ఇదే గోల్డెన్​ చాన్స్ : మోడీ

పెట్టుబడులకు ఇదే గోల్డెన్​ చాన్స్ : మోడీ

బ్లూమ్‌‌‌‌బెర్గ్ బిజినెస్ ఫోరంలో  విదేశీ కంపెనీలకు పీఎం మోడీ పిలుపు

న్యూయార్క్​: ‘‘మీ దగ్గర టెక్నాలజీ ఉంది, మా దగ్గర యంగ్​ ఎక్స్​పర్ట్స్​ ఉన్నారు. ఇద్దరం కలిస్తే బిజినెస్​ కూడా బాగా సాగుతుంది. రండి.. ఇండియాలో పెట్టుబడులు పెట్టండి.. కార్పొరేట్​ ట్యాక్స్​ను కూడా భారీగా తగ్గించేశాం.. ఈ గోల్డెన్​ ఆపర్చునిటీని వదులుకోకండి..’’అంటూ విదేశీ పారిశ్రామికవేత్తలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. న్యూయార్క్‌‌‌‌లో బుధవారం జరిగిన బ్లూమ్‌‌‌‌బెర్గ్ బిజినెస్ ఫోరంలో  40కిపైగా విదేశీ కంపెనీల సీఈవోలతో రౌండ్​టేబుల్​ సమావేశంలో ఆయన మాట్లాడారు.

కొత్తగా ఏదైనా చేద్దామనుకునే కంపెనీలకు ఇండియా ఆకర్షణీయ మార్కెట్​అని, స్టార్టప్‌‌‌‌ల్లో పెట్టుబడులకు కూడా చాలా అవకాశాలున్నాయని, కోల్​మైనింగ్​లో 100 శాతం ఎఫ్​డీఐలకు అనుమతిచ్చామని తెలిపారు. ఇండియాను 5 ట్రిలియన్​ డాలర్ల ఎకానమీగా తయారుచేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని, గత ఐదేండ్లలో 286 బిలియన్​ డాలర్ల ఎఫ్​డీఐలు వచ్చాయని, రాబోయే రోజుల్లో మోడ్రన్​ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌పై భారీమొత్తంలో 1.3 ట్రిలియన్ డాలర్లు ఖర్చుచేయబోతున్నామని, ఈజ్​ ఆఫ్​ బిజినెస్​ కోసమే 50కిపైగా పాత చట్టాలను రద్దుచేశామని, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కూడా కంపెనీలకు కలిసొచ్చే అంశమని వివరించారు.