This week OTT Movies: ఆడియన్స్ గెట్ రెడీ..ఈవారం OTTలో క్రేజీ సినిమాలు ఇవే

This week OTT Movies: ఆడియన్స్ గెట్ రెడీ..ఈవారం OTTలో క్రేజీ సినిమాలు ఇవే

ప్రతీవారం లాగే ఈ వారం కూడా సరికొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. థియేటర్స్ మాత్రమే కాకుండా.. ఓటీటీ(OTT) సంస్థలు కూడా ప్రేక్షకుల కోసం కొత్త కొత్త కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి.అదే విదంగా ఈ వారం కూడా సరికొత్త సినిమాలు ఓటీటీలో సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ ఏ సినిమా ఏ ఏ ఓటీటీలలో స్ట్రీమింగ్ కానుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

మలయాళ ఇండస్ట్రీ మేకర్స్ ఎంచుకునే కథల్లో వైవిధ్యత కనిపిస్తోంది. జనాల మధ్యలోనే తిరిగే కథలతో ఆధ్యంతం ఆసక్తి కలిగించే సన్నివేశాలను రాసుకుంటారు దర్శక రచయితలు. భారీ బడ్జెట్ చిత్రాలే కాకుండా..చిన్న బడ్జెట్తో తెరకెక్కిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. 

ప్రేమలు

లేటెస్ట్గా గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ప్రేమలు (Premalu) మూవీ కేరళ ఇండస్ట్రీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నెల (ఫిబ్రవరి 9న) మలయాళంలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. సుమారు రూ.6కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కిన ప్రేమలు ఏకంగా రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు తెలుగు ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. ఆ తర్వాత తెలుగులోనూ సంచలన విజయం సాధించింది. ఇక ఇప్పుడు శుక్రవారం (మార్చి 29న ) ఓటీటీలోకి రానుంది. ప్రముఖ  ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతోపాటు తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. 

లూటేరే 

లూటేరే వెబ్ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో అదరగొడుతుంది. అదేంటీ అనుకుంటున్నారా! అయితే గత శుక్రవారమే (మార్చి 22) హాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చింది ఈ సీరీస్. అయితే ఫస్ట్ రెండు ఎపిసోడ్లను మాత్రమే ఓటీటీ డిస్నీహాట్‌స్టార్ రిలీజ్ చేసింది. లేటెస్ట్ గా మూడో ఎపిసోడ్ గురువారం (మార్చి 28) నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ట్రూ లవర్ 

మాస్ మూవీ(Mass Movies) పతాకంపై ప్రముఖ దర్శకుడు మారుతి(Maruthi), నిర్మాత SKN కలిసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన లేటెస్ట్ మూవీ ట్రూ లవర్(True Lover). తమిళంలో సూపర్ హిట్ ఐన ఈ సినిమాను ప్రభురామ్ వ్యాస్(Prabhuram Vyas) తెరకెక్కించగా..మణికందన్(Manikandan), గౌరీ ప్రియ(Gouri Priya) జంటగా నటించారు.ఫిబ్రవరి 10న థియేటర్స్ లోకి వచ్చిన అవుట్ అండ్ అవుట్ యూత్ఫుల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది.ఈ నెల (మార్చి 27) నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.

పట్నా శుక్లా 

బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టండన్ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ పట్నా శుక్లా.  ఈ మూవీ శుక్రవారం (మార్చి 29) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే..ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా. బీహార్ లో జరిగిన ఓ ఎడ్యుకేషన్ స్కామ్ చుట్టూ తిరిగే కథతో మూవీ ఉత్కంఠగా సాగుతుంది. 

అమెజాన్ ప్రైమ్‌‌‌‌‌‌‌‌ వీడియో

ఇన్‌స్పెక్టర్ రిషి:

నవీన్ చంద్ర లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో నటించిన వెబ్ సిరీస్ ‘ఇన్‌స్పెక్టర్ రిషి’. నందిని జె.ఎస్ దర్శకత్వంలో  సునైన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. హారర్ క్రైమ్ కథతో ఈ వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌ను రూపొందించారు. సుఖ్ దేవ్ లాహిరి నిర్మించిన ఈ సిరీస్ ఈ నెల (మార్చి 29) నుంచి అమెజాన్ ప్రైమ్‌‌‌‌‌‌‌‌ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూసిన కాజల్ అగర్వాల్ చాలా ఇంటరెస్టింగ్‌‌‌‌‌‌‌‌గా ఉందని..టీమ్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పింది. 

నెట్‌ఫ్లిక్స్ 

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో

ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ నుంచి వచ్చిన లేటెస్ట్ షో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఆదివారం (మార్చి 29) నుంచి స్ట్రీమింగ్ కానుంది. అంతేకాదు ప్రతి శని, ఆదివారాల్లో కొత్త ఎపిసోడ్లు రానున్నాయి. 

 లాల్ సలామ్

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ప్రత్యేక పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ లాల్ సలామ్(Lal Salaam). రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్(Aishwarya Rajinikanth) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విష్ణు విశాల్(Vishnu Vishal), విక్రాంత్(Vikranth) హీరోలుగా నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 9న రిలీజయి..ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు ఈ  మూవీ  నెట్‌ఫ్లిక్స్‌ లో మార్చి 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

బుక్‌మైషో

ది హోల్డోవర్స్

పాల్ గియామట్టి, డావిన్ జాయ్ రాండోల్ఫ్ మరియు డొమినిక్ సెస్సా ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ మూవీ మార్చి 29నుంచి బుక్‌మైషోలో స్ట్రీమింగ్ కానుంది.

  • Beta
Beta feature
  • Beta
Beta feature
  • Beta
Beta feature