
నాని హీరోగా వివేక్ ఆత్రేయ రూపొందిస్తున్న చిత్రం ‘అంటే సుందరానికీ’. నజ్రియా నజీమ్ హీరోయిన్. నిన్న ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘పంచె కట్టు’ అనే పల్లవితో సాగే ఈ పాటకు వివేక్ సాగర్ క్యాచీ ట్యూన్ కంపోజ్ చేశాడు. ‘రంగంలో దూకారు, భలే అందంగా మాస్టారు,హెయ్ సరదాలా సరుకే మీరు’ అంటూ ట్రెండీ లిరిక్స్ రాశాడు హసిత్ గోలి. ప్రముఖ కర్ణాటక సంగీత గాయని అరుణా సాయిరామ్ పాడారు. వీడియోలో సుందరంగా నాని క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేశారు. అమెరికాలోని పాపులర్ ఏరియాలు తిరుగుతూ వెరైటీ కాస్ట్యూమ్స్‌లో కనిపించాడు నాని. తన బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జూన్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది.