టీమిండియాతో సిరీస్ మాకు చాలా ముఖ్యమైనది : టామ్ లాథమ్

టీమిండియాతో సిరీస్ మాకు చాలా ముఖ్యమైనది : టామ్ లాథమ్

టీమిండియాతో రేపట్నుంచి జరిగే వన్డే సిరీస్ తమకు చాలా ముఖ్యమైనదని న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ అన్నారు. ఇండియాలోనే వరల్డ్కప్ జరుగనున్న నేపథ్యంలో ఈ సిరీస్ను సీరియస్గా తీసుకున్నట్లు చెప్పారు. విలియమ్సన్, సౌథీ లేకపోవడంతో యంగ్ ప్లేయర్స్కి అవకాశం లభించిందని.. ఇది కూడా మంచి పరిణామమే అని అన్నారు. పాకిస్థాన్తో 2–1  తేడాతో సిరీస్ గెలిచామని.. అక్కడ కూడా ఏసియన్ కండిషన్స్ కావడం తమకు అడ్వంటేజ్ అన్నారు. ఇండియాలోని పిచ్లు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ అనుకూలంగా ఉంటాయని.. పిచ్కు తగ్గట్టు రాణించే టీం తమతో ఉందన్నారు. ఇప్పటికే ఐపీఎల్ ఆడినందు వల్ల ఎవరి పర్ఫార్మెన్స్ ఏంటో తమకు తెలుసని స్పష్టం చేశారు. కాగా రేపు భారత్ న్యూజిలాండ్ మధ్య ఉప్పల్ వేదికగా తొలి వన్డే జరగనుంది.