ఈ యూఎస్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌తో ఇండియన్ బ్యాంకులకు లింకుల్లేవు

ఈ యూఎస్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌తో ఇండియన్ బ్యాంకులకు లింకుల్లేవు
  • బ్యాంకు షేర్లూ పడినా..క్వాలిటీ షేర్లు కొనుక్కోండి
  • సలహాయిస్తున్న ఎనలిస్టులు

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: యూఎస్‌‌‌‌‌‌‌‌లోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభం మన మార్కెట్‌‌‌‌‌‌‌‌పై కూడా పడనుంది. అయినప్పటికీ ఈ ప్రభావం షార్ట్ టర్మ్‌‌‌‌‌‌‌‌ వరకే ఉంటుందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఎస్‌‌‌‌‌‌‌‌వీబీతో డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా మన దేశంలోని బ్యాంకులకు లింక్‌‌‌‌‌‌‌‌లు లేవు. ఇండియన్ బ్యాంక్ షేర్లు పడినప్పడు, క్వాలిటీ షేర్లను కొనుక్కోవాలని ఎనలిస్టులు సలహాయిస్తున్నారు. ట్రెండ్ రివర్స్ అయితే ఈ బ్యాంకు షేర్లు మంచి రిటర్న్ ఇస్తాయని చెబుతున్నారు.  ఎస్‌‌‌‌‌‌‌‌వీబీ  సంక్షోభం వలన యూఎస్ బ్యాంక్‌ షేర్లు శుక్రవారం సెషన్‌‌‌‌‌‌‌‌లో భారీగా క్రాష్ అయ్యాయి. ఎస్‌‌‌‌‌‌‌‌వీబీ షేర్లు వరుసగా రెండో సెషన్‌‌‌‌‌‌‌‌లో కూడా 60 శాతం పడగా, ఫస్ట్‌‌‌‌‌‌‌‌ రిప్లబిక్ బ్యాంక్ 30 శాతం మేర, వెస్ట్రన్ అలయెన్స్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్ కార్పొరేషన్ 20 శాతం మేర పడ్డాయి. ఈ మూడు బ్యాంకుల్లోనే 500 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయని అంచనా.  యూఎస్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ షేర్లు గత 24 గంటల్లో 100 బిలియన్ డాలర్ల మార్కెట్‌‌‌‌‌‌‌‌ క్యాప్‌‌‌‌‌‌‌‌ను కోల్పోయాయి.  కాగా, ఎస్‌‌‌‌‌‌‌‌వీబీ ఆస్తులను ఫెడరల్ డిపాజిట్‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌‌‌‌‌‌‌‌డీఐసీ) శుక్రవారం సీజ్ చేసింది. అంతేకాకుండా వీటి ఆపరేషన్స్‌‌‌‌‌‌‌‌ను తాత్కాలికంగా నిలిపేసింది. డిపాజిటర్లు ఈ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ బ్రాంచుల వద్ద క్యూ కడుతున్నారు.  రూల్స్ ప్రకారం, 2,50,000 డాలర్ల లోపు డిపాజిట్లకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంది. దీనిని బట్టి ఎస్‌‌‌‌‌‌‌‌వీబీలోని 85 శాతం డిపాజిట్లకు ఎటువంటి ఇన్సూరెన్స్ లేదని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఈ ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌ గ్లోబల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లతో పాటే మన మార్కెట్‌‌‌‌‌‌‌‌లపై కూడా పడొచ్చన్నారు.

మన బ్యాంకులు స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌గానే..

 ఇండియన్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ల ఫండమెంటల్స్‌‌‌‌‌‌‌‌ బాగున్నాయని, క్వార్టర్లీ రిజల్ట్స్ మెరుగ్గా ఉన్నాయని ఫ్రాఫిట్‌‌‌‌‌‌‌‌మార్ట్‌‌‌‌‌‌‌‌ రీసెర్చ్ హెడ్‌‌‌‌‌‌‌‌ అవినాష్‌‌‌‌‌‌‌‌  గోరక్షకార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  అన్నారు. ఎస్‌‌‌‌‌‌‌‌వీబీకి, దేశ బ్యాంకులకు లింక్‌‌‌‌‌‌‌‌లు పెద్దగా లేవని, అలానే దేశంలోని కార్పొరేట్ కంపెనీలకు ఎస్‌‌‌‌‌‌‌‌వీబీ పెద్దగా అప్పులు కూడా ఇవ్వలేదని వివరించారు. గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా నెగెటివ్‌ ట్రెండ్ ఉండడం వలనే శుక్రవారం మార్కెట్‌‌‌‌‌‌‌‌ క్రాష్ అయ్యిందని చెప్పారు. షార్ట్‌‌‌‌‌‌‌‌ టర్మ్‌‌‌‌‌‌‌‌లో వడ్డీ రేట్లు హయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవెల్‌‌‌‌‌‌‌‌లో ఉంటే  మన బ్యాంకులకు ప్రయోజనమేనని, కానీ, ఎక్కువ కాలం పాటు కొనసాగితే మాత్రం వీటి బిజినెస్‌‌‌‌‌‌‌‌పై  ప్రభావం ఉంటుందని  అంచనావేశారు. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఎంపీసీ మీటింగ్‌‌‌‌‌‌‌‌పై ఫోకస్ పెట్టాలని సలహాయిచ్చారు. కొంత మంది ఎస్‌‌‌‌‌‌‌‌వీబీ క్రైసిస్‌‌‌‌‌‌‌‌ను  2008 ఫైనాన్షియల్ క్రైసిస్‌‌‌‌‌‌‌‌తో పోలుస్తున్నారని పేర్కొన్నారు. ‘ దేశ బ్యాంకులు స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌గా ఉన్నాయి. రిటైల్‌‌‌‌‌‌‌‌, కార్పొరేట్ అప్పులకు మంచి డిమాండ్ ఉంది. రూపాయి పతనమైనప్పుడు అప్పుల కోసం విదేశాలకు వెళ్లిన కార్పొరేట్ కంపెనీలు,  తిరిగి ఇండియా వైపు చూస్తాయి’ అని ఐఐఎఫ్ఎల్‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీస్‌‌‌‌‌‌‌‌ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్‌‌‌‌‌‌‌‌) అనుజ్ గుప్తా పేర్కొన్నారు.  ఎస్‌‌‌‌‌‌‌‌వీబీ సంక్షోభం వలన మార్కెట్‌‌‌‌‌‌‌‌ పడితే, క్వాలిటీ షేర్లను ఎంచుకోవాలని గుప్తా ఇన్వెస్టర్లకు సలహాయిచ్చారు. ఐసీఐసీఐ బ్యాంక్‌‌‌‌‌‌‌‌, యాక్సిస్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ ఫస్ట్ బ్యాంక్ వంటి షేర్లలో ఇన్వెస్ట్ చేయాలని అన్నారు.

ఇండియన్ స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఎస్‌‌‌‌‌‌‌‌వీబీ పెట్టుబడులు

 దేశంలోని సుమారు 21 స్టార్టప్‌‌‌‌‌‌‌‌లలో ఎస్‌‌‌‌‌‌‌‌వీబీకి ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లు ఉన్నాయని అంచనా.  సాస్‌‌‌‌‌‌‌‌ యూనికార్న్‌‌‌‌‌‌‌‌  ఐసెర్టిస్‌‌‌‌‌‌‌‌లో 150 మిలియన్ డాలర్లను ఎస్‌‌‌‌‌‌‌‌వీబీ ఇన్వెస్ట్ చేసింది. ఈక్విటీగా మార్చుకోవడానికి వీలుండే విధంగా  స్టార్టప్‌‌‌‌‌‌‌‌లకు ఈ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ అప్పులిచ్చింది. ఇప్పటి వరకు బ్లూస్టోన్‌‌‌‌‌‌‌‌, కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాలా, ఇన్‌‌‌‌‌‌‌‌మొబి, లాయల్టీ రివార్డ్‌‌‌‌‌‌‌‌జ్‌‌‌‌‌‌‌‌లు ఎస్‌‌‌‌‌‌‌‌వీబీని నుంచి ఫండ్స్ సేకరించాయి. డేటా ఎనలిటిక్స్ కంపెనీ ట్రాక్షన్ ప్రకారం, 2011 తర్వాత దేశంలోని స్టార్టప్‌‌‌‌‌‌‌‌లలో ఈ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ తక్కువగా ఇన్వెస్ట్ చేసింది. కానీ, యూఎస్‌‌‌‌‌‌‌‌లోని మెజార్టీ వెంచర్ క్యాపిటలిస్టుల డిపాజిట్లు ఎస్‌‌‌‌‌‌‌‌వీబీలో ఉన్నాయి. తాజా సంక్షోభం వలన ఈ వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాపిటలిస్టుల నుంచి దేశ స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు ఫండింగ్ సేకరించడం కష్టంగా మారొచ్చు. 

గతంలో ఇన్వెస్ట్ చేశారు..ఇప్పుడు కాదు

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పేటీఎంలో  ఎర్లీ  స్టేజ్‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్ట్ చేసిందని కంపెనీ  సీఈఓ విజయ్‌‌‌‌‌‌‌‌ శేఖర్ శర్మ  అన్నారు. సిలికాన్ గ్లోబల్ హెడ్‌‌‌‌‌‌‌‌ యాష్‌‌‌‌‌‌‌‌ లిలాని తమను సపోర్ట్‌‌‌‌‌‌‌‌ చేశారని ట్వీట్ చేశారు. ఆయన సహకారంతో టెల్కో వాస్ కంపెనీగా ఉన్న తాము ప్రస్తుత స్టేజ్‌‌‌‌‌‌‌‌కు ఎదిగామని పేర్కొన్నారు.  కంపెనీలోని తమ వాటాలను  ఎస్‌‌‌‌‌‌‌‌వీబీ ఎప్పుడో మంచి లాభాలకు అమ్మేసిందని, ఇప్పుడు వారు షేరు హోల్డర్లుగా లేరన్నారు.

క్రిప్టోలపై మరో పిడుగు..

ఎఫ్‌‌‌‌‌‌‌‌టీఎక్స్ సంక్షోభం,  ఆ తర్వాత  సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గేట్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్ దివాలా తీయడం, తాజాగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సర్కిల్స్‌ క్రైసిస్‌‌‌‌‌‌‌‌ ...క్రిప్టో ఇండస్ట్రీని అతలాకుతలం చేస్తున్నాయి. వీటి ఎఫెక్ట్ డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా ఇండియన్ క్రిప్టో ఎక్స్చేంజిలపై లేనప్పటికీ, వీటిలో ట్రేడవుతున్న బిట్‌‌‌‌‌‌‌‌కాయిన్‌‌‌‌‌‌‌‌, ఎథీరియం, ఎక్స్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ, బైనాన్స్‌‌‌‌‌‌‌‌ కాయిన్‌‌‌‌‌‌‌‌, డోజ్‌‌‌‌‌‌‌‌ కాయిన్‌‌‌‌‌‌‌‌, షిబా ఇను వంటి క్రిప్టోలు శుక్రవారం 5–9 శాతం మేర పతనమయ్యాయి. యూఎస్‌‌‌‌‌‌‌‌లోని మెజార్టీ క్రిప్టో ఎక్స్చేంజిలు, ఈ ఇండస్ట్రీలోని స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు తమ ఫండ్స్‌‌‌‌‌‌‌‌ను ఎస్‌‌‌‌‌‌‌‌వీబీలో డిపాజిట్ చేసుకున్నాయి. దీంతో గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా క్రిప్టో ఎక్స్చేంజి షేర్లు, క్రిప్టో కరెన్సీలు పడుతున్నాయని, ఈ ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌ లోకల్‌‌‌‌‌‌‌‌గా కూడా కనిపిస్తోందని ఎనలిస్టులు వెల్లడించారు. కాగా, సిల్వర్ గేట్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌‌‌‌‌వీబీ రెండూ కూడా క్రిప్టోల్లో ట్రేడింగ్ చేసే రిటైలర్లకు, ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు సర్వీస్‌‌‌‌‌‌‌‌లు అందిస్తున్నాయి. 

కొనడానికి నేను రెడీనే..

దివాలా బాటలో ఉన్న సిలికాన్ వ్యాలీ  బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనడానికి తనకు అభ్యంతరం లేదని టెస్లా బాస్ ఎలన్ మస్క్ ప్రకటించారు. ‘ఎస్‌‌‌‌‌‌‌‌వీబీని  ట్విట్టర్ కొని, డిజిటల్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌గా మార్చితే బాగుంటుంది’ అని రేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫౌండర్ మిన్‌‌‌‌‌‌‌‌ లియాంగ్ టాన్ చేసిన ట్వీట్‌‌‌‌‌‌‌‌కు మస్క్  స్పందించారు. ఈ ఆలోచన బాగుందని పేర్కొన్నారు. ఎలన్ మస్క్ 44 బిలియన్ డాలర్లు పెట్టి ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిజిటల్‌‌‌‌‌‌‌‌ పేమెంట్స్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్ చేస్తామని, ఈ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌లో  ‘అన్ని ఉండేలా’ చేస్తామని ప్రకటించారు.