OTTలో ప్రతివారం లాగే ఈ వారం కూడా (2025 డిసెంబర్ 1 నుంచి 7 వరకు) ఇంట్రెస్టింగ్ మూవీస్ రానున్నాయి. క్రైమ్, డ్రామా, లవ్, యాక్షన్ థ్రిల్లర్ జోనర్స్లో ఆడియన్స్ను అలరించడానికి సినిమాలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా 30కి పైగా సినిమాలు జీ5, ప్రైమ్, ఆహా, నెట్ ఫ్లిక్స్ వంటి ప్లాట్ఫామ్స్ లలో వస్తున్నాయి. ఇందులో తెలుగు నుంచి దాదాపు అన్నీ కొత్త సినిమాలే వస్తుండటం విశేషం. తిరువీర్ నటించిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, రష్మిక మందన్న థామా, ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాలు ఇంట్రెస్టింగ్గా ఉండనున్నాయి. మరి ఈ సినిమాలన్నీ ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ కానున్నాయో వివరాలు చూసేద్దాం.
ఆహా:
ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ (తెలుగు డబ్బింగ్ క్రైమ్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 05
జీ5:
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (తెలుగు కామెడీ డ్రామా)- డిసెంబర్ 5
ఘర్‌వాలీ పెడ్వాలీ (హిందీ హారర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 5
బే దునే తీన్ (మరాఠీ కామెడీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 5
సోనీ లివ్:
కుట్రమ్ పురిందవన్ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)-డిసెంబర్ 5
అమెజాన్ ప్రైమ్:
థామా (తెలుగు డబ్బింగ్ హిందీ కామెడీ హారర్ థ్రిల్లర్)- డిసెంబర్ 2 (రెంట్ విధానం)
ట్రోన్ ఎరెస్ (ఇంగ్లీష్ ఫిక్షన్ థ్రిల్లర్)- డిసెంబర్ 2
ఓ వాట్ ఫన్ (ఇంగ్లీష్ కామెడీ)- డిసెంబర్ 3
నెట్‌ఫ్లిక్స్:
కోకోమెలన్ లేన్ సీజన్ 6 (ఇంగ్లీష్ యానిమేషన్ చిల్డ్రన్ సిరీస్)- డిసెంబర్1
ఆల్ ద ఎంప్టీ రూమ్స్ (ఇంగ్లీష్ సోషల్ కల్చరల్ డాక్యుమెంటరీ)- డిసెంబర్1
ట్రోల్ 2 (నార్వేజియన్ హారర్ మిస్టరీ)- డిసెంబర్1
ప్లేయింగ్ గ్రేసీ డార్లింగ్ (ఇంగ్లీష్ హారర్ మిస్టరీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 1
కిల్లింగ్ ఈవ్ (బ్రిటీష్ స్పై థ్రిల్లర్ సిరీస్)- డిసెంబర్ 2
మై సీక్రెట్ శాంటా (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ)- డిసెంబర్ 3
విత్ లవ్ మేగన్: హాలీడే సెలబ్రేషన్ (ఇంగ్లీష్ రియాలిటీ హాలీడే సిరీస్)- డిసెంబర్ 3
లలి: టైమ్ టు స్టెప్ అప్ (అర్జెంటేనియన్ పాప్ స్టార్ లలి డాక్యుమెంటరీ)- డిసెంబర్ 4
ది బిలీవర్స్ సీజన్ 2 (థాయి క్రైమ్ డ్రామా థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 4
ఐ విష్ యూ హ్యాడ్ టోల్డ్ మీ (ఇంగ్లీష్ నోవెల్ రొమాంటిక్)- డిసెంబర్ 4
ది గర్ల్‌ఫ్రెండ్ (తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా)- డిసెంబర్ 5
జే కెల్లీ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా)- డిసెంబర్ 5
స్టీఫెన్ (తెలుగు డబ్బింగ్ తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ)- డిసెంబర్ 5
లవ్ అండ్ వైన్ (సౌత్ ఆఫ్రికన్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్)- డిసెంబర్ 5
ది ప్రైస్ ఆఫ్ కన్ఫెషన్ (కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 5
ఓనింగ్ మ్యాన్‌హటన్: సీజన్ 2 (ఇంగ్లీష్ రియాలిటీ లైఫ్‌స్టైల్ గేమ్ షో)- డిసెంబర్ 5
ప్రో బోనో (కొరియన్ లీగల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 6
పొరోరో సూపర్ సూపర్ షో (కొరియన్ కిడ్స్ కార్టూన్ సిరీస్)- డిసెంబర్ 7
జియో హాట్‌స్టార్:
ది బ్యాడ్ గాయ్స్ 2 (ఇంగ్లీష్ యానిమేషన్ కామెడీ హీస్ట్)- డిసెంబర్ 1
గ్రిఫ్ఫిన్ ఇన్ సమ్మర్ (ఇండీ కామెడీ డ్రామా)- డిసెంబర్ 2
ఆర్కిటెక్టన్ (ఇంగ్లీష్ ఎక్స్‌పరిమెంటల్ డాక్యుమెంటరీ)- డిసెంబర్ 4
డైస్ ఈరే (తెలుగు డబ్బింగ్ మలయాళ హారర్ మిస్టరీ థ్రిల్లర్)- డిసెంబర్ 5
బిగ్ బాస్ 19 గ్రాండ్ ఫినాలే హిందీ (హిందీ రియాలిటీ గేమ్ షో)- డిసెంబర్ 7
ఆపిల్ టీవీ ప్లస్:
ద హంట్ (ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ సిరీస్)- డిసెంబర్ 3
ది ఫస్ట్ స్నో ఆఫ్ ఫ్రాగల్ రాక్ (ఇంగ్లీష్ యానిమేషన్ కామెడీ)- డిసెంబర్ 5
SUN NXT:
అరసయ్యన ప్రేమ పసంగ (కన్నడ కామెడీ)- డిసెంబర్ 5
