Theatre Movies: ఈ వారం (జూన్ 27) థియేటర్ సినిమాలివే.. తెలుగులో కన్నప్పతో పాటు క్రైమ్ థ్రిల్లర్స్

Theatre Movies: ఈ వారం (జూన్ 27) థియేటర్ సినిమాలివే.. తెలుగులో కన్నప్పతో పాటు క్రైమ్ థ్రిల్లర్స్

ఈ వారం (జూన్ 27) థియేటర్లలో ప్రేక్షకుల సందడి గట్టిగానే ఉండనుంది. భారీ అంచనాల మధ్య రిలీజయ్యే సినిమాలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన భక్తిరస చిత్రం కన్నప్ప మూవీ విడుదల కానుంది. ఇందులో ప్రభాస్, విష్ణు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి బిగ్ స్టార్స్ ఉండటంతో మూవీపై మంచి క్యూరియాసిటీ నెలకొంది.

అలాగే, తెలుగు డబ్డ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ తో పాటు బాలీవుడ్ నుంచి హారర్ థ్రిల్లర్ రానుంది. ప్రస్తుతం థియేటర్లో కుబేర ఒక్కడే కుమ్మేస్తున్నాడు. జూన్ 20న రిలీజైన కుబేర.. బాక్సాఫీస్ మొత్తాన్ని సొంతం చేసుకున్నాడు. కన్నప్ప వచ్చేవరకు కుబేరతోనే ఆడియన్స్ ఎంటర్ టైన్ అవ్వనున్నారు. ఈ వారం సినిమాల వైపు ఓ లుక్కేసుకోండి!

కన్నప్ప:

మంచు విష్ణు హీరోగా నటించిన ‘కన్నప్ప’జూన్‌‌‌‌‌‌‌‌ 27న విడుదల కానుంది. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని 'కన్నప్ప' చిత్రాన్ని తెరకెక్కించారు. 

'మహాభారత' సిరీస్ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్ప సినిమాకి దర్శకత్వం వహించాడు. జూన్ 27న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. భక్తి, ప్రేమ, త్యాగం, విధితో నిండిన ఈ ప్రతిష్టాత్మకమైన మూవీకి విష్ణు స్క్రీన్ ప్లే, స్టోరీ అందించాడు. 

మార్గన్:

విజయ్ ఆంటోని హీరోగా నటిస్తూ, నిర్మించిన మూవీ ‘మార్గన్’.లియో జాన్ పాల్ దర్శకుడు. తెలుగులో జె.రామాంజనేయులు విడుదల చేస్తున్నారు. జూన్ 27న సినిమా విడుదల కానుంది. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్‌‌ ఎక్స్‌‌పీరియన్స్‌‌ను ఇచ్చేలా టీజర్, ట్రైలర్ విజువల్స్ ఉన్నాయి.

ఈ మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌లో విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధీషన్‌‌‌‌ విలన్‌‌‌‌గా పరిచయం అవుతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సురేష్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్ ద్వారా సురేష్ బాబు రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

మా (MAA):

కాజోల్ దేవగణ్‌‌‌‌‌‌‌‌ లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కిన హారర్ మూవీ ‘మా’(MAA). విశాల్ ఫూరియా దర్శకత్వం వహించాడు. జియో స్టూడియోస్‌‌‌‌‌‌‌‌తో కలిసి  అజయ్ దేవగణ్‌‌‌‌‌‌‌‌, జ్యోతి శాంతా సుబ్బరాయన్ నిర్మించారు. దుష్ట శక్తుల బారిన పడిన తన బిడ్డను ఓ తల్లి ఎలా కాపాడుకుందనే హారర్ థ్రిల్లర్ కథాంశంతో మూవీ తెరకెక్కింది.

అజయ్ దేవగణ్‌‌‌‌‌‌‌‌ ‘షైతాన్‌‌‌‌‌‌‌‌’ మూవీ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్ అని మేకర్స్ ముందునుంచి చెప్పుకొస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే మూవీ ట్రైలర్ విజువల్స్ ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, కథాపరంగా దర్శకుడు విశాల్ ఫూరియా గత చిత్రాలైన చోరి, చోరి 2 చిత్రాలు గుర్తొస్తాయి. రోనిత్ రాయ్, సుభద్ర సేన్ గుప్త, ఇంద్రనీల్, జితిన్ జ్యోతి గులాటీ ఇతర పాత్రలు పోషించారు. జూన్ 27న సినిమా విడుదల కానుంది.