This week OTT Movies: ఆడియన్స్ గెట్ రెడీ.. ఈవారం OTTలో క్రేజీ సినిమాలు

This week OTT Movies: ఆడియన్స్ గెట్ రెడీ.. ఈవారం OTTలో క్రేజీ సినిమాలు

ప్రతీవారం లాగే ఈ వారం కూడా సరికొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. థియేటర్స్ మాత్రమే కాకుండా.. ఓటీటీ(OTT) సంస్థలు కూడా ప్రేక్షకుల కోసం కొత్త కొత్త కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ఇక నిన్నటినుండే (మార్చ్ 17) మోస్ట్ అవైటెడ్ మూవీ హనుమాన్ ఓటీటీలో సందడి చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ వ్యూస్ సాధించి దోసుకుపోతోంది. 

అదే విదంగా ఈ వారం కూడా సరికొత్త సినిమాలు ఓటీటీలో సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ ఏ సినిమా ఏ ఏ ఓటీటీలలో స్ట్రీమింగ్ కానుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

హాట్‌స్టార్:

  • మార్చి 20: అబ్రహం ఓజ్లర్ (తెలుగు డబ్బింగ్ సినిమా), సాండ్ ల్యాండ్: ద సిరీస్ (జపనీస్ సిరీస్), ఎక్స్-మ్యాన్ '97 (ఇంగ్లీష్ సిరీస్)
  • మార్చి 22: అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ (ఇంగ్లీష్ సినిమా), డేవీ & జాన్సీస్ లాకర్ (ఇంగ్లీష్ సిరీస్), లూటేరే (హిందీ సిరీస్)
  • మార్చి 24: ఫొటోగ్రాఫర్ సీజన్ 1

నెట్‌ఫ్లిక్స్:

  • మార్చి 18: యంగ్ రాయల్స్ ఫరెవర్ (స్వీడిష్ సినిమా) 
  • మార్చి 21: 3 బాడీ ప్రాబ్లమ్ (ఇంగ్లీష్ సిరీస్), ఫైటర్ (హిందీ మూవీ)
  • మార్చి 22: బైయింగ్ బేవర్లీ హిల్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్), షిర్లే (ఇంగ్లీష్ సినిమా),ద కసగ్రెనేడ్స్ మూవీ (ఇంగ్లీష్ మూవీ)

అమెజాన్ ప్రైమ్:

  • మార్చి 19: మరక్కుమ నెంజమ్ (తమిళ మూవీ) 
  • మార్చి 21: ఏ వతన్ మేరే వతన్ (హిందీ సినిమా), రోడ్ హౌస్ (ఇంగ్లీష్ చిత్రం)

జియో సినిమా:

  • మార్చి 21: ఓపెన్ హైమర్ (తెలుగు డబ్బింగ్)