హోర్సెన్స్ (డెన్మార్క్): థామస్ కప్ ఫైనల్స్‌లో ఇండియాకు చైనా చెక్ పెట్టింది. ఇప్పటికే క్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నా.. బుధవారం జరిగిన గ్రూప్–ఎ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఇండియా 2–3తో చైనా చేతిలో కంగుతిన్నది. దాంతో గ్రూప్‌లో రెండో ప్లేస్‌తోనే సరిపెట్టుకుంది. తొలి సింగిల్స్‌లో లక్ష్యసేన్ 19–21, 21–8, 12–21తో లి షి ఫెంగ్ చేతిలో పోరాడి ఓడాడు. డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ 13–21, 21–13, 24–26తో లియాంగ్ వీ కెంగ్–వాంగ్ చాంగ్ చేతిలో కంగుతిన్నారు.
హోరాహోరీగా సాగిన నిర్ణయాత్మక మూడో గేమ్‌లో చిరాగ్ జోడీ చివరి వరకు ప్రయత్నించినా సక్సెస్ కాలేదు. రెండో సింగిల్స్‌లో ఆయుష్ శెట్టి 17–21, 21–13, 21–15తో వెంగ్ హాంగ్ యాంగ్ చేతిలో ఓడాడు. రెండో డబుల్స్‌లో హరిహరన్–ఎం.ఆర్ అర్జున్ 17–21, 13–21తో హి జి టింగ్–రెన్ జియాంగ్ యు చేతిలో పరాజయం చవిచూశాడు. చివరిదైన మూడో సింగిల్స్‌లో హెచ్.ఎస్. ప్రణయ్ 20–22, 21–19, 21–11తో లు గుయాంగ్ జుపై నెగ్గాడు.

