మత్తు పదార్థాలను నిర్మూలించడమే లక్ష్యం : డీఎస్పీ కృష్ణ కిశోర్

మత్తు పదార్థాలను నిర్మూలించడమే లక్ష్యం : డీఎస్పీ కృష్ణ కిశోర్

నెల్లికుదురు( ఇనుగుర్తి), వెలుగు: మత్తు పదార్థాలను నిర్మూలించడమే లక్ష్యమని తొర్రూర్ డీఎస్పీ కృష్ణ కిశోర్ అన్నారు. శనివారం మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్​నాథ్ కేకన్ ఆదేశాల మేరకు ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 4 క్వింటాళ్ల బెల్లం, 4 వేల లీటర్ల సార, 20 లీటర్ల లిక్కర్, సరైన ధ్రువపత్రాలు లేని 22 బైకులు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. 

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గ్రామాల్లో ఎవరైనా గుడుంబా తయారుచేసినా, అమ్మినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో నెల్లికుదురు ఎస్సై రమేశ్​ బాబు, దంతాలపల్లి ఎస్సై రాజు, పెద్ద వంగర క్రాంతి కిరణ్, నర్సింహులపేట ఎస్సై సురేశ్​ సిబ్బంది పాల్గొన్నారు.