ఎలక్షన్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలి

ఎలక్షన్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలి

నిర్మల్, వెలుగు: బీపీ, షుగర్, గుండె సమస్యలతోపాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈసారి ఎలక్షన్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యాటకారి సాయన్న, ప్రధాన కార్యదర్శి ఓడ్నం రవిరాజు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ లో వినతి పత్రం అందించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ బాధపడుతున్న వారంతా ఎలక్షన్ డ్యూటీలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.

పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఇబ్బందులు తలెత్తకుండా, గందరగోళ పరిస్థితులు ఏర్పడకుండా ప కడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. సంఘం నాయకులు శంకర్, శ్రీకాంత్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.