ఆ రెండు పార్టీలు ఏపీని ఆగం చేశాయి : మంత్రి హరీష్ రావు

ఆ రెండు పార్టీలు ఏపీని ఆగం చేశాయి : మంత్రి హరీష్ రావు

తాను మాట్లాడిన మాటలకు ఓ ఏపీ మంత్రి ఎగెరెగిరి పడుతున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. "మీ దగ్గర ఏమున్నది అని అంటున్నారు... మా దగ్గర ఉన్నవి చెప్పమంటే దునియా చెబుతాం.. మీ దగ్గర ఏమున్నాయి..?" అని ప్రశ్నించారు. ఆనాడు ప్రత్యేక హోదా కావాలని అన్నారని, ఇప్పుడేమో అడగరని చెప్పారు. అధికారంలో ఉన్న వాళ్ళు అడగరు... ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు ప్రశ్నించరంటూ హరీష్ రావు ఆరోపించారు. విశాఖ ఉక్కును తుక్కుకి అమ్మిన ఎవ్వరూ అడగరంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలను గాలికి వదిలేశారని, మీ ప్రయోజనాలు చూసుకుంటున్నారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష టీడీపీ.. రెండు పార్టీలు కలిసి ఏపీని ఆగం చేశాయని మంత్రి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో నివసిస్తున్న ఏపీ వాళ్లు.. ఇక్కడే ఓటు హక్కు నమోదు చేసుకోండన్న మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విరుచుకుపడ్డారు. తెలంగాణ మంత్రులు అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి ఏపీలోకి తొంగి చూస్తే.. వైసీపీ ప్రభుత్వం చేసే అభివృద్ధి ఏంటో కనిపిస్తుందంటూ కారుమూరి వ్యాఖ్యానించారు. ఏపీలో రోడ్లు సరిగా లేవని మంత్రి చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్న ఆయన..  ఏపీ ప్రజలు మళ్ళీ సీఎం జగనే రావాలని కోరుకుంటున్నారని తేల్చి చెప్పారు.