గుడి వరకూ వెళ్లలేని వాళ్లు వర్చువల్ గా కూడా పూజలో పాల్గొనొచ్చు

గుడి వరకూ వెళ్లలేని వాళ్లు వర్చువల్ గా కూడా పూజలో పాల్గొనొచ్చు

నవరాత్రుల సందర్భంగా చాలామంది దగ్గర్లోని గుడి లేదా మండపానికి వెళ్లి దుర్గామాతకు పూజ చేస్తుంటారు. అయితే గుడి వరకూ వెళ్లలేని వాళ్లు వర్చువల్ గా కూడా పూజలో పాల్గొనొచ్చు అంటున్నారు కోల్‌‌కతాలోని మెటాఫార్మ్ కంపెనీ ఫౌండర్లు. ‘మెటాపుజో’ పేరుతో ప్రపంచంలోనే మొదటిసారి వర్చువల్‌‌గా పూజల్లో పాల్గొనే టెక్నాలజీని డెవలప్ చేశారు వీళ్లు.

‘మెటాపుజో’ అనే వర్చువల్ పూజ ప్లాట్‌‌ఫామ్ ద్వారా  ఉన్నచోట నుంచే పూజలో పాల్గొనొచ్చు. కళ్లకు వీఆర్ హెడ్‌‌సెట్ పెట్టుకుని, పూజ నుంచి హారతి వరకూ అన్నీ వర్చువల్‌‌గా వీక్షించొచ్చు. ఈ వర్చువల్ పూజను మెటాపుజో అని పిలుస్తారు. ‘మెటాఫార్మ్’, ‘ఎక్స్‌‌ప్యాండ్ ల్యాండ్’ కంపెనీలు కలిసి మెటాపుజోను డెవలప్ చేశాయి. మెటాపుజో ద్వారా కోల్‌‌కతాలోని నాలుగు ఫేమస్ మండపాల్లో జరిగే పూజలను వర్చువల్ రియాలిటీలో చూడొచ్చు. వర్చువల్ పూజలో పాల్గొనడం కోసం ముందుగా  ‘ఎక్స్‌‌ప్యాండ్‌‌ల్యాండ్(www.xpand-land.com)’ వెబ్‌‌సైట్‌‌లోకి వెళ్లాలి. అందులో ‘వెబ్ 3.0’ వ్యాలెట్ ఉంటుంది. అందులో టోకెన్ తీసుకోవాలి. ఆ టోకెన్ సాయంతో ‘మెటాపుజో’ ప్లాట్‌‌ఫామ్‌‌లో ఎంటర్ అవ్వొచ్చు. కళ్లకు వీఆర్ హెడ్‌‌సెట్ పెట్టుకుని, నచ్చిన మండపాన్ని ఎంచుకుంటే క్షణాల్లోనే  వర్చువల్‌‌గా అక్కడ వాలిపోతారు.