ట్రైనింగ్ కు రానివారికి షోకాజ్‍ నోటీసులు

ట్రైనింగ్ కు రానివారికి షోకాజ్‍ నోటీసులు

కలెక్టర్‍ మస్రత్‍ ఖానమ్‍ అయేషా

వికారాబాద్‍, వెలుగు: పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మార్చి31న నిర్వహించిన ఎన్నికల శిక్షణ తరగతులకు హాజరుకాని  పీఓలు, ఏపీఓలకు షోకాజ్‍ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్‍ మస్రత్‍ ఖానమ్‍ అయేషా ఒక ప్రకటనలో తెలిపారు. పరిగి నియోజకవర్గంలో44 మంది, వికారాబాద్‍ నియోజకవర్గంలో 11 మంది, తాండూరు నియోజకవర్గంలో 39 మంది పీఓలు, ఏపీఓలు శిక్షణ తరగతులకు హాజరు కాలేదని చెప్పారు. వీరందరికినోటీసులు ఇచ్చినట్లు కలెక్టర్‍ తెలిపారు.

ఎన్నికలకు పార్టీలు సహకరించాలి

పార్లమెంటు ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్‍ మస్రత్‍ ఖానమ్‍ అయేషా అన్నారు. అదనంగా వచ్చిన బ్యాలెట్‍ యూనిట్లు , కంట్రోల్‍ యూనిట్లు ఆయా నియోజకవర్గాలకు పంపినట్లు వివిధ పార్టీల నేతలకు చెప్పారు. కలెక్టరేట్‍లోని సమావేశ మందిరంలో వివిధ రాజకీయపార్టీల ప్రతినిధులతో రెండో ర్యాండమైజేషన్‍ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ 23 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని,మహబుబ్ నగర్‍, సంగారెడ్డి జిల్లాల నుంచి అదనంగా బ్యాలెట్‍ యూనిట్లు తెప్పించినట్లు చెప్పారు. జేసీ అరుణకుమారి, రాజకీయ పార్టీల  నాయకులు పాల్గొ న్నారు.