2023 Cinema Rewind: 2023లో వచ్చిన వెయ్యి కోట్ల సినిమాలు?!

2023 Cinema Rewind: 2023లో వచ్చిన వెయ్యి కోట్ల సినిమాలు?!

ఒకప్పుడు ఇండియన్ సినిమాలు వంద కోట్లు కలెక్ట్ చేశాయంటే చాలా గొప్పగా చెప్పుకునే వారు కానీ.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బాహుబలి సినిమా తరువాత ఇండియన్ సినిమాలు వెయ్యి కోట్ల మార్క్ ను సైతం ఈజీగా దాటేస్తున్నాయి. స్టార్ హీరో ఉండి.. కాస్త పాజిటీవ్ టాక్ వచ్చిందంటే చాలు వెయ్యి కోట్ల మార్క్ ఈజీగా దాటేస్తున్నాయి మన సినిమాలు. అలా ఇప్పటికే  బాలీవుడ్ నుండి దంగల్, కన్నడ ఇండస్ట్రీ నుండి కేజీఎఫ్, టాలీవుడ్ నుండి బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సంవత్సరం(2023) కూడా వెయ్యి కోట్ల సినిమాలు వచ్చాయి. మరి ఆ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ గురించి చెప్పుకోవాలి. ప్రముఖ నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్ కు ఆడియన్స్ నుండి సూపర్ హిట్ టాక్ వచ్చింది. దానికి తోడు చాలా కాలంగా షారుఖ్ కు సరైన హిట్ లేకపోవడంతో పఠాన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఎగబడ్డారు. అలా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. లాంగ్ రన్ లో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

ఆతరువాత కూడా షారుఖ్ హీరోగా వచ్చిన జవాన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తమిళ దర్శకుడు అట్లీ కుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల నుండి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. పఠాన్ వంటి సూపర్ హిట్ తరువాత షారుఖ్ నుండి వచ్చిన సినిమా కావడంతో జవాన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండటంతో.. కలెక్షన్స్ లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది జవాన్ మూవీ.

ఈ సంవత్సరం మరో రెండు సినిమాలు కూడా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరనున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాటిలో ఇటీవల విడుదలైన యానిమల్, రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సలార్, డంకి సినిమాలు ఉన్నాయి. యానిమల్ విషయానికి వస్తే ఈ సినిమా ఇప్పటికే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇక డిసెంబర్ చివర్లో ప్రభాస్ నటించిన సలార్, షారుఖ్ నటించిన డంకి చిత్రాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. 

ఈ రెండు కూడా పాన్ ఇండియా లెవల్లో భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అంతేకాదు ఈ రెండు సినిమాలపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. కాబట్టి.. హిట్ టాక్ వచ్చిందంటే చాలు ఈ రెండు సినిమాలు కూడా ఈజీగా వెయ్యి కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అలా ఒకే ఇయర్ లో ఐదు వెయ్యి కోట్ల సినిమాలు రాబోతుండటంలో 2023 ఇండియన్ సినీ ఇండస్ట్రీకి మెమరబుల్ ఇయర్ గా మారనుంది.