వద్దన్న ఊరేగింపు.. వేలసంఖ్యలో భక్తులు

వద్దన్న ఊరేగింపు.. వేలసంఖ్యలో భక్తులు

ఓవైపు కరోనా కేసులు భారీగా పెరుగుతుంటే.. మరోవైపు జనం  ఏ మాత్రం భయం లేకుండా బయట తిరుగుతున్నారు. మాస్కులు పెట్టుకోండి అని మొత్తుకుంటున్నా.. మాట వినడం లేదు. తాజాగా కర్నాటకలోని చిక్ మంగళూరు జిల్లాలో రథోత్సవం నిర్వహించారు. శకున రంగనాథ స్వామి రథోత్సవ వేడుకకు జనం భారీగా తరలివచ్చారు. వేల సంఖ్యలో భక్తులు స్వామివారి రథోత్సవానికి హాజరయ్యారు. వీరిలో చాలామంది మాస్కులు కూడా ధరించారు. ఇక భౌతిక దూరం కూడా ఎక్కడా కనిపించలేదు. అయితే ఎలాంటి ఊరేగింపులు నిర్వహించరాదని స్థానిక అధికారులు ఆదేశించిన తర్వాత కూడా రథోత్సవం నిర్వహించడం గమనార్హం. కర్నాటక పోలీసులు సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధించిన కొన్ని గంటల్లోనే.. స్థానికులు ఈ రథోత్సవాన్ని నిర్వహించడం విశేషం.

అయితే  స్వామి వారి  శోభాయాత్రకు  అధికారులు అనుమతి నిరాకరించారు. కేవలం ఆలయ ప్రాంగణంలో ఉత్సవాలను నిర్వహించవచ్చని, ఈ ఉత్సవాలకు 50 మందికి మించి హాజరుకాకూడదని చిక్కమగళూరు డిప్యూటీ కమిషనర్‌ స్థానిక తహసీల్దార్‌కు జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు.కానీ రథోత్సవంలో మాత్రం జనం భారీగా తరలివచ్చారు. స్వామివారి రథం లాగేందుకు పోటీ పడ్డారు. ఎలాంటి భౌతిక దూరం పాటించలేదు. చాలామంది భక్తులు మాస్కులు ధరించలేదు. రథంపై కూడా ముగ్గురు అర్చకులు కూర్చొని పూజలు చేస్తున్నారు.వాళ్లు సైతం మాస్కులు లేకుండానే కనిపించారు. మరోవైపు కర్నాటకలో సోమవారం 27,156 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.  పాజిటివ్ రేటు 12.45 శాతం ఉంది. ఇక కరోనా కారణంగా రాష్ట్రంలో 14 మంది చనిపోయారు. ఇక రథోత్సవం జరిగిన చిక్కమంగళూరులో గత 24 గంటల్లో 236 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి: 

ఎన్నికల వేళ సీఎంకు షాక్.. మేనల్లుడి ఇంటిపై ఈడీ దాడులు

తమిళ జంట వెరైటీ రిసెప్షన్