ఇంట్లో ఫ్రిట్జ్, కూలర్ వైర్లను చెక్ చేస్తూ ఉండండి.. జయశంకర్ జిల్లాలో వైర్ తగిలి మూడేళ్ల చిన్నారి..

ఇంట్లో ఫ్రిట్జ్, కూలర్ వైర్లను చెక్ చేస్తూ ఉండండి.. జయశంకర్ జిల్లాలో వైర్ తగిలి మూడేళ్ల చిన్నారి..

ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఊహించడం కష్టం అంటే ఇదేనేమో. అప్రమత్తంగా ఉండకుంటే ఇంట్లో వాడే ఫ్రిట్జ్, కూలర్ల వైర్లు కూడా యమపాశాలై ప్రాణాలు తీస్తాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూలర్ వైర్ తగిలి చిన్నారి మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. 

బుధవారం (అక్టోబర్ 29) జిల్లాలోని రేగొండ మండలం ఆర్జీ తండా గ్రామంలో ఘోర విషాదం చోటుచేసుకుంది.  ఇంట్లో ఉన్న ఎయిర్ కూలర్ వైరు తగిలి ఓ చిన్నారి మృతి చెందింది. గ్రామానికి చెందిన బానోతు వీరు,  ప్రియాంకల కూతురు అంజలి (3) ఇంట్లో ఉన్న కూలర్ వైరు తగిలి మృతి చెందింది.

కూలర్ వైరు ఒకటి కరెంటు బోర్డులో మరొకటి కిందపడి ఉండడంతో ఆడుకుంటూ వెళ్లి ముట్టుకుంది. ఇంట్లో ఎవరు లేకపోవడంతో చిన్నారి విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

►ALSO READ | వరంగల్ సిటీలో కుండపోత వర్షం : రోడ్లపై నదుల్లా పారుతున్న నీళ్లు